ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ పరిస్థితి చాలా భిన్నంగా ఉందన్నారు ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత దాస్. భారత్ లో ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి లేదన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేటును పెంచాయని దీనికారణంతో హార్డ్ ల్యాండింగ్ సంభవించిందన్నారు. భారత్ పరిస్థితి చాలా భిన్నంగా ఉన్నప్పటికీ మాంద్యం వచ్చే ఛాన్స్ లేదన్నారు.
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్యోల్బణం తాత్కాలికంగా కాకుండా స్థిరంగా ఉందని అన్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడ్ వడ్డీ రేట్లను దూకుడుగా పెంచడంతోనే అమెరికా డాలర్ విలువను పెరిగిందన్నారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన ఆర్బీఐ ఆర్థిక, విధాన పరిశోధన విభాగం వార్షిక సదస్సులో పాల్గొని పలు అంశాల గురించి చర్చించారు. జూన్ 2016 నుంచి ఫిబ్రవరి 2020 వరకు సగటు ద్రవ్యోల్భణం 3.9శాతంగా ఉందన్నారు. ఆ సమయంలో ద్రవ్యోల్బణం ఏకారణాల వల్ల అదుపులో అనేది ఆ సమయం పరిశోధన అంశమని వివరించారు.