World University Rankings : ప్రపంచ టాప్ వర్సిటీల జాబితాలోని భారత విద్యాసంస్థలివే..
Pasha
World University Rankings : ప్రపంచంలోని టాప్ క్లాస్ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌ను ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ విడుదల చేసింది. 2025 సంవత్సరానికిగానూ విడుదల చేసిన ఈ జాబితాలో మన దేశానికి చెందిన పలు వర్సిటీలు కూడా చోటు సంపాదించాయి. దేశాలవారీగా టాప్ యూనివర్సిటీల వివరాలతో మరో ప్రత్యేక జాబితాను సైతం ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ రిలీజ్ చేసింది. దీనిప్రకారం.. మన దేశంలో నంబర్ 1 యూనివర్సిటీగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) నిలిచింది. అయితే ప్రపంచంలోని టాప్ -100 యూనివర్సిటీల లిస్టులో కనీసం ఒక్క భారత యూనివర్సిటీకి కూడా చోటు దక్కలేదు. ప్రపంచంలో నంబర్ 1 యూనివర్సిటీగా బ్రిటన్‌లోని ‘ఆక్స్‌ఫర్డ్’ నిలవగా, నంబర్ 2 ప్లేస్‌లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిలిచింది. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం మూడో స్థానం(World University Rankings)సాధించింది.
ఐఐఎస్‌సీ బెంగళూరు మన దేశంలోనే నంబర్ 1 యూనివర్సిటీ. ప్రపంచ స్థాయిలో దీని ర్యాంకు 251 నుంచి 300 మధ్యలో ఉంది.
తమిళనాడులోని అన్నా యూనివర్సిటీకి మన దేశంలో రెండో ర్యాంకు వచ్చింది. ప్రపంచ స్థాయిలో దీని ర్యాంకు 401 నుంచి 500 మధ్యలో ఉంది.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం మన దేశంలో మూడో ర్యాంకు సాధించింది. ప్రపంచ స్థాయిలో దీని ర్యాంకు 401 నుంచి 500 మధ్యలో ఉంది.
తమిళనాడులోని సవిత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్‌కు మన దేశంలో నాలుగో ర్యాంకు వచ్చింది. ప్రపంచ స్థాయిలో దీని ర్యాంకు 401 నుంచి 500 మధ్యలో ఉంది.
చండీగఢ్‌లోని శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌కు మన దేశంలో ఐదో ర్యాంకు వచ్చింది. ప్రపంచ స్థాయిలో దీని ర్యాంకు 401 నుంచి 500 మధ్యలో ఉంది.
మధ్యప్రదేశ్‌లోని ఐఐటీ ఇండోర్‌కు మన దేశంలో ఆరో ర్యాంకు వచ్చింది. ప్రపంచ స్థాయిలో దీని ర్యాంకు 501 నుంచి 600 మధ్యలో ఉంది.
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాకు మన దేశంలో ఏడో ర్యాంకు వచ్చింది. ప్రపంచ స్థాయిలో దీని ర్యాంకు 501 నుంచి 600 మధ్యలో ఉంది.
ఉత్తరాఖండ్‌లోని యూపీఈఎస్‌కు మన దేశంలోని ఎనిమిదో ర్యాంకు వచ్చింది. ప్రపంచ స్థాయిలో దీని ర్యాంకు 501 నుంచి 600 మధ్యలో ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి మన దేశంలో 9వ ర్యాంకు వచ్చింది. ప్రపంచ స్థాయిలో దీని ర్యాంకు 601 నుంచి800 మధ్యలో ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి మనదేశంలో 10వ ర్యాంకు వచ్చింది. ప్రపంచ స్థాయిలో దీని ర్యాంకు 601 నుంచి 800 మధ్యలో ఉంది.
ఈసారి ప్రపంచ స్థాయిలో 601 నుంచి 800 మధ్య ర్యాంకింగ్స్ సాధించిన భారతీయ విద్యాసంస్థల జాబితాలో బిట్స్ పిలానీ, చిత్కారా విశ్వవిద్యాలయం, ఐఐటీ పాట్నా, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, కేఐఐటీ విశ్వవిద్యాలయం, ఎల్‌పీయూ, ఎంఎన్‌ఐటీ, పీయూ, టీఐఈటీ, వీఐటీ యూనివర్సిటీలు ఉన్నాయి.