Jharkhand Elections Result : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి మళ్లీ విజయఢంకా మోగించింది. రాష్ట్రంలో మొత్తం 81 సీట్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 33 స్థానాల్లో సీఎం హేమంత్ సోరెన్‌కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ లీడ్‌లో ఉంది. ఆయా సీట్లు చాలా వరకు జేఎంఎం ఖాతాలో పడే అవకాశం ఉంది. జేఎంఎం మిత్రపక్షాలు కాంగ్రెస్ 13 స్థానాల్లో, ఆర్‌జేడీ 4 స్థానాల్లో, సీపీఐ(ఎంఎల్) 2 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నాయి. ఇవన్నీ కలుపుకుంటే.. మొత్తంగా 52 అసెంబ్లీ సీట్లలో ఇండియా కూటమి లీడ్‌లో ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్.. 41 సీట్లు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన అసెంబ్లీ సీట్ల కంటే ఎక్కువే గెల్చుకునే దిశగా ఇండియా కూటమికి(Jharkhand Elections Result) ఫలితాలు వచ్చాయి.
Also Read :Governor Statue : రాజ్‌భవన్‌లో గవర్నర్ విగ్రహం.. స్వయంగా ఆవిష్కరించిన ఆనంద్ బోస్
జార్ఖండ్‌లో ఇండియా కూటమికి ఈ ఘన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర ఎవరు పోషించారంటే.. కచ్చితంగా సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్‌ల పేర్లు చెప్పుకోవాల్సిందే. వీరిద్దరి కాంబినేషన్‌ను జార్ఖండ్ రాజకీయ పరిశీలకులు ‘బంటీ ఔర్ బబ్లీ’గా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం జార్ఖండ్‌లోని బర్హయిత్ అసెంబ్లీ స్థానంలో సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్ గాండే స్థానంలో లీడ్‌లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులను హేమంత్ సోరెన్ తట్టుకున్న తీరును వారు కొనియాడుతున్నారు. హేమంత్ సోరెన్ ఈడీ కేసుల్లో జైలుకు వెళ్లే టైంలో.. చంపై సోరెన్‌ను నమ్మి ఆయనకు సీఎం పదవిని కట్టబెట్టారు. ఈక్రమంలో సీఎం పదవిని తనకు కేటాయించలేదనే అక్కసుతో హేమంత్ వదిన సీతా సోరెన్ కూడా జేఎంఎం నుంచి బీజేపీలోకి వెళ్లిపోయారు. చివరకు హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటికి రాగానే.. చంపై సోరెన్ సీఎం పదవికి, జేఎంఎం పార్టీకి రాజీనామా చేసి జంప్ అయ్యారు. ఈ ఘటనతో చంపై సోరెన్‌పై రాష్ట్ర ప్రజలకు నెగెటివ్ అభిప్రాయం ఏర్పడింది. ఆయన వెళ్లి బీజేపీలో చేరడం, బీజేపీకి కూడా మైనస్ అయింది.
Also Read :Maharashtra CM : దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం అవుతారంటున్న బీజేపీ.. ఏక్‌నాథ్ షిండే రియాక్షన్ ఇదీ
కల్పనా సోరెన్ చొరవ..
హేమంత్ సోరెన్ జైలులో ఉన్న టైంలో సభలు, వివిధ కార్యక్రమాల ద్వారా జేఎంఎం క్యాడర్‌ను యాక్టివ్‌గా ఉంచడంలో కల్పనా సోరెన్ కీలక పాత్ర పోషించారు. ఇండియా కూటమిలోని పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో కల్పన పాల్గొన్నారు. తన భర్త హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేయడంపై అన్ని ప్రముఖ విపక్ష పార్టీల నాయకులతో మాట్లాడించడంలో ఆమె సక్సెస్ అయ్యారు. తద్వారా జేఎంఎం నాయకత్వం ఇంకా యాక్టివ్‌గానే ఉందనే సందేశాన్ని క్యాడర్‌లోకి పంపారు. దీంతో జేఎంఎం నుంచి బీజేపీలోకి నేతల వలసలు ఆగాయి. ఆదివాసీ ఓటర్లు హేమంత్ సోరెన్‌కు అండగా నిలిచారు. దీంతో వారి ప్రాబల్యమున్న స్థానాలన్నీ జేఎంఎం ఖాతాలో పడ్డాయి.