Trump : దిగొచ్చిన అమెరికా అధ్యక్షుడు..ప్రధాని మోడీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా..

ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ఈ చర్చలు దోహదపడతాయి అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీని నాకు ఎంతో సన్నిహితమైన మిత్రుడు అని ఆయన అభివర్ణించారు. రాబోయే వారాల్లో మోడీతో చర్చలకు తాను ఉత్సుకతగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
The US President who came down... is ready to talk to Prime Minister Modi...

The US President who came down... is ready to talk to Prime Minister Modi...

Trump: భారత్, అమెరికా మధ్య కొంతకాలంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలకు ముగింపు దిశగా పరిణామాలు జరగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాణిజ్య సంబంధాల్లో తిరిగి చైతన్యం రావచ్చని ఇరు దేశాల నాయకులు వెల్లడించిన తాజా ప్రకటనలతో అంచనాలు పెరిగాయి. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య గతంలో నిలిచిపోయిన చర్చలు తిరిగి ప్రారంభమవడం ద్వారానే వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు మార్గం సుగమమవుతుందని వారు అభిప్రాయపడ్డారు.

బుధవారం ప్రధాని మోడీ మాట్లాడుతూ..భారత్-అమెరికా వాణిజ్య చర్చలు త్వరలోనే విజయవంతంగా పూర్తవుతాయని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ చర్చలను సమర్థంగా ముగించేందుకు మా బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి అని తెలిపారు. త్వరలోనే ట్రంప్‌తో ప్రత్యక్షంగా మాట్లాడతానని కూడా వెల్లడించారు. ఇక, డొనాల్డ్ ట్రంప్, తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో మంగళవారం ఒక సందేశాన్ని పంచుకున్నారు. భారత్‌తో వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభమైనట్లు ప్రకటించడానికి సంతోషంగా ఉంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ఈ చర్చలు దోహదపడతాయి అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీని నాకు ఎంతో సన్నిహితమైన మిత్రుడు అని ఆయన అభివర్ణించారు. రాబోయే వారాల్లో మోడీతో చర్చలకు తాను ఉత్సుకతగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మోడీ కూడా తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ..భారత్-అమెరికా సంబంధాలు సహజ భాగస్వామ్యంగా కొనసాగుతున్నాయి.

ఈ వాణిజ్య చర్చలు, రెండు దేశాల మధ్య ఉన్న అపార అవకాశాలను వెలికితీసేందుకు మార్గం చూపుతాయని నేను నమ్ముతున్నాను. మేము కలిసి పనిచేస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం అని పేర్కొన్నారు. గతంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న అంశంపై అమెరికా అసంతృప్తిని వ్యక్తపరచింది. ప్రతిగా అమెరికా కొన్ని సుంకాలను విధించగా, వాటిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పట్లో ప్రధాని మోడీ ట్రంప్ చేసిన ఫోన్ కాల్స్‌కు స్పందించలేదు అనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం ట్రంప్ ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ట్రంప్, మోడీపై ప్రశంసలు కురిపిస్తూ..మోడీ గొప్ప నాయకుడు. భారత్‌తో అమెరికా ప్రత్యేక సంబంధాలను కొనసాగిస్తుంది అని వ్యాఖ్యానించారు. దీనికి బదులుగా మోదీ కూడా ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతించారు. ఇది ఇద్దరు దేశాల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యానికి ప్రతీక అని అన్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ తాజా సంకేతాలతో భారత్-అమెరికా మధ్య వాణిజ్య సుంకాల వివాదానికి సమాధానం దొరికే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య మళ్లీ సహకారం పెరిగితే, గ్లోబల్ ఎకానమీపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

Read Also: AP : ఏపీలో పీపీపీ ద్వారా కొత్త దిశ..10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం

  Last Updated: 10 Sep 2025, 10:19 AM IST