Site icon HashtagU Telugu

Fact Check: సమాధికి తాళం వేసిన ఘటన పాకిస్తాన్‌ది కాదు.. హైదరాబాద్ పాతబస్తీది.. వీడియో వైరల్..!

Graveyard Padlock

Resizeimagesize (1280 X 720) 11zon

Fact Check: గత కొన్ని రోజులుగా సమాధికి తాళం (Graveyard Padlock) వేసిన ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయ్యింది. ఇందులో తమ కుమార్తెల మృతదేహాలను రేపిస్టుల నుండి రక్షించడానికి తల్లిదండ్రులు పాకిస్తాన్‌లో వారి సమాధులకు తాళాలు వేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పరిశీలిస్తే అసలు విషయం మరొకటి ఉంది. తొలుత ఈ ఫోటోను రచయిత హారిస్ సుల్తాన్ ట్వీట్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. ఇందులో రాడికల్ ఇస్లామిస్ట్ భావజాలం ఇలాంటి పని చేస్తోందని ఆరోపించారు. తన ట్వీట్‌లో అతను సమాధికి తాళాలు వేసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు.

నిజానికి ఈ ఫోటో పాకిస్థాన్‌ది కాదు ఇండియాది. గ్రీన్ గ్రిల్‌తో ఉన్న చిత్రం ఇండియాలోని హైదరాబాద్ నగరానికి చెందినది అని ఆల్ట్ న్యూస్ ట్వీట్ చేసింది. పాత సమాధుల్లో అనుమతి లేకుండా వేరే మృతదేహాలను ఎవరూ పూడ్చిపెట్టకూడదనే ఉద్దేశంతో ఈ గ్రిల్స్‌ ను సమాధులకు అమర్చి తాళాలు వేసినట్లు ఆల్ట్ న్యూస్ తన కథనంలో పేర్కొంది. వైరల్ అయినా సమాధి ఒక వృద్ధ మహిళది. ఆమె కుమారుడు ఈ విధంగా గ్రిల్‌ను అమర్చాడు.

Also Read: Gold Price Today: స్థిరంగా పసిడి ధరలు.. వెండి ధరలు మాత్రం ఇలా..!

ఈ ఫోటో నిజం వెలుగులోకి రావడంతో రచయిత హారిస్ సుల్తాన్ తన మునుపటి ట్వీట్‌ను తొలగిస్తున్నట్లు తెలిపారు. 2011లో పాకిస్థాన్‌లో నెక్రోఫిలియా కేసు వెలుగులోకి వచ్చింది. కరాచీలోని ఉత్తర నజీమాబాద్‌కు చెందిన ముహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తి శ్మశానవాటికలోని 48 శవాలపై అత్యాచారం చేసినట్లు అంగీకరించిన తర్వాత అతనిని అరెస్టు చేశారు. పాకిస్తాన్‌లోని మహిళల మృతదేహాలను అనేక సందర్భాల్లో అపవిత్రం చేశారని, అందుకే ఈ తాళాలు అమర్చబడిందని అనేక మీడియా నివేదికలు ఇటీవల పేర్కొన్నాయి. అయితే, ఈ వైరల్ అయినా వీడియో పాకిస్థాన్ డి కాదని, నిజం వేరే ఉందని తేలింది.