ఈయన జీవిత కథ ఆధారంగా తీసిన సినిమానే ‘జైభీమ్’

ప్రైమ్ లో విడుదలైన జైభీమ్ మూవీ అన్నివర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల అభిమానాన్ని పొందుతోంది. ఇందులో సూర్య ప్రధాన పాత్రలో నటించగా,

  • Written By:
  • Updated On - November 3, 2021 / 05:21 PM IST

ప్రైమ్ లో విడుదలైన జైభీమ్ మూవీ అన్నివర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల అభిమానాన్ని పొందుతోంది. ఇందులో సూర్య ప్రధాన పాత్రలో నటించగా, ప్రకాష్ రాజ్, రజిషా విజయన్, లిజోమోల్ జోస్ సహాయక పాత్రల్లో నటించారు. ప్రధానంగా మానవ హక్కుల కోసం పనిచేసిన చంద్రు అనే సీనియర్ న్యాయవాది మానవ హక్కులకు సంబంధించిన కేసుల కోసం ఒక్క పైసా కూడా వసూలు చేయలేదు. ఈయన నిజ జీవిత కేసు నుంచి ఈ చిత్రం స్పూర్తి పొందింది. చంద్రు 1995లో గిరిజన సమాజానికి న్యాయం కోసం పోరాడారు. ఈ ప్రత్యేక చిత్రం ఇరులర్ కమ్యూనిటీకి చెందిన గిరిజన మహిళ కేసు ఆధారంగా రూపొందింది.

గిరిజనులు ఎదుర్కొంటున్న కస్టడీ టార్చర్, కుల వివక్ష గురించి ఈ మూవీ కళ్లకు కట్టింది. చంద్రు అనే సామాజిక కార్యకర్త మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తి. మానవ హక్కులకు సంబంధించిన అనేక కేసులను పరిష్కరించారు. దాదాపు 96,000 కేసులను పరిష్కరించారు. కులంతో సంబంధం లేకుండా అందరికీ అన్నివర్గాల ప్రజల పక్షాన నిలిచారు. తన కెరీర్‌లో ఈ కేసులకు ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా వసూలు చేయకపోవడం అతని పనితనానికి నిదర్శనంగా చెప్పక తప్పదు. మహిళల తరపున, అట్టడుగు వర్గాలకు చెందిన వారి తరపున అనేక కేసులపై కూడా పోరాడాడు. 2006 జూలై 31న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి, 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మార్చి 2013లో న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.