Site icon HashtagU Telugu

Jallikattu : జల్లికట్టుకు జెండా ఊపిన తమిళనాడు ప్రభుత్వం

Jallikattu

Jallikattu

తమిళనాడు పురాతన సంప్రదాయ క్రీడ జల్లికట్టు (Jallikattu). బలమైన ఎద్దులను బరిలోకి వదిలి లొంగదీసుకోవడం ఈ క్రీడలో చూడొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సంప్రదాయ క్రీడగా గుర్తింపు పొందింది. సంక్రాంతి సీజన్ లో తమిళనాట జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. ఈ సంక్రాంతి సీజన్ ను పురస్కరించుకుని రాష్ట్రంలో రేపటి నుంచి జల్లికట్టు (Jallikattu) పోటీలు జరుపనున్నారు. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 1 నుంచి ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. అయితే దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండడంతో, ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంది. జల్లికట్టు కోసం ప్రజల నుంచి డిమాండ్లు అధికమవుతుండడంతో, నూతన మార్గదర్శకాలతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈసారి జల్లికట్టు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతిని తప్పనిసరి. తొలిసారిగా చెన్నై నగరంలో జల్లికట్టు నిర్వహించాలని ప్రముఖ నటుడు, మక్కళ్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్ హాసన్ భావిస్తున్నారు. అందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది.

Also Read:  Chandra Babu : మళ్ళీ జగన్ కు ఛాన్స్ ఇస్తే ఇక అంతే! టీడీపీ వినూత్న ప్రచారం