Supreme Court : కేంద్రంపై సుప్రీం గుస్సా.. ప్రధానిని ప్రశ్నించే దమ్మునోడు కావాలి.!!

  • Written By:
  • Updated On - November 24, 2022 / 11:56 AM IST

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా డీవై చంద్రచూడ్ వచ్చాక ఎన్నో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెండింగ్ లో ఉన్న అనేక కేసులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్యానెల్ సభ్యుల ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సీఈసీ ఇతర ఎన్నికల కమిషనర్ల ఎంపిక పారదర్శకంగా లేదంటూ అత్యున్నత ధర్మాసనంలో దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంలో ఎంతో సమర్థవంతంగా ఎలక్షన్స్ నిర్వహించిన దివంగత టీఎన్ శేషన్ లాంటి అధికారి కావాలంటూ వ్యాఖ్యానించింది.

ప్రధాని కూడా ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న అధికారి కావాలని కుండ బద్ధలు కొట్టింది సుప్రీం. ఈసీల నియామకం సమయంలో సీజేఐని కూడా సంప్రదించాలని స్పష్టం చేసిన సుప్రీం…తాజాగా కేంద్రం నియమించిన అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. సీఈసీ రాజకీయాలకు దూరంగా ఉండాలని..స్పష్టం చేసింది. 24గంటల్లో విచారణ ఎలా జరిగిందంటూ ప్రశ్నించారు. దీనిపై అటార్నీ జనరల్ అన్నింటికి సమాధానం చెబుతారని కనీసం మాట్లాడేందుకు కోర్టు అవకాశం ఇవ్వాలన్నారు.