Site icon HashtagU Telugu

RSS: ముస్లిం మతపెద్దలతో సమావేశం కోసం మసీదుకు వెళ్లిన ఆర్ఎస్ఎస్ చీఫ్..!!

Mohan Bhagavath

Mohan Bhagavath

ఆర్‌ఎస్‌ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ గురువారం కస్తూర్బా గాంధీ మార్గ్‌లోని మసీదుకు చేరుకుని, పలువురు ముస్లిం మత పెద్దలు, మేధావులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా డా. మోహన్ భగవత్ వెంట సంఘ ప్రచారక్ ఇంద్రేష్ కుమార్ ఉన్నారు.

ముస్లిం మత పెద్దలు, మేధావులతో RSS చీఫ్ మోహన్ భగవత్ సమావేశం కావడం ద్వారా, దేశంలో మతపరమైన అపార్థాలు, కమ్యూనికేషన్ అంతరాలను తొలగించడం ద్వారా దేశ నిర్మాణంలో మైనారిటీ వర్గాల భాగస్వామ్యాన్ని పెంచవచ్చని సంఘ్ పెద్దలు భావిస్తున్నారు. ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవ మత పెద్దలతో చర్చల వెనుక సంఘ్ కీలక వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

సంఘ్ చీఫ్ ముస్లిం మత పెద్దలను కలిశారు:
ఇప్పటికే మైనారిటీ మత సంస్థలతో చర్చించే నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసింది. దాని బాధ్యతను సహ డాక్టర్ కృష్ణ గోపాల్, డాక్టర్ మన్మోహన్ వైద్యతో పాటు అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రాంలాల్, సీనియర్ ప్రచారకుడు ఇంద్రేష్ కుమార్‌లకు అప్పగించారు. సంఘ్ చీఫ్‌తో ముస్లిం మత పెద్దలు, మేధావుల ఇలాంటి సమావేశాలను ఈ కమిటీ ద్వారా నిర్వహిస్తారు.

ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ మోహన్ భగవత్‌ను చాలా రోజుల క్రితమే ఆల్ ఇండియా ఇమామ్ సంగతన్ చీఫ్ ఇమామ్ ఇలియాసి సాహబ్ ఆహ్వానించారని చెప్పారు. అందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయనను కలిశారు.ఇది సాధారణ కమ్యూనికేషన్ ప్రక్రియలో భాగమని ఆయన తెలిపారు.