PM Modi: ఆయుష్మాన్ కార్డుల సంఖ్య 28 కోట్ల 50 ల‌క్ష‌లు, మోడీ హర్షం

  • Written By:
  • Updated On - December 26, 2023 / 11:28 AM IST

PM Modi: దేశ ప్ర‌జ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ఆయుష్మాన్ భార‌త్ ఆరోగ్య కార్డుల సంఖ్య 28 కోట్ల 50 ల‌క్ష‌ల‌కు చేర‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.  మ‌రీ ముఖ్యంగా దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న విక‌సిత భార‌త్ సంక‌ల్ప యాత్ర‌ల్లో అర్హులైన కోటి మందికి పైగా ల‌బ్ధిదారుల‌కు ఆయుష్మాన్ భార‌త్ కార్డులు అంద‌జేయ‌డాన్ని ఆయ‌న కొనియాడారు. కాగా ఆయుష్మాన్ భార‌త్ కార్డులు మ‌హారాష్ట్ర‌లోనే ఎక్కువ‌గా పంపిణీ చేశారు.

ఈ రాష్ట్రంలో 2 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఈ కార్డులు పొందారు. ప్ర‌స్తుతం పెరిగిపోయిన వైద్య ఖ‌ర్చుల నేప‌థ్యంలో సాధార‌ణ‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు 5 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన వైద్యాన్ని ఆయుష్మాన్ భార‌త్ కార్డుల ద్వారా ఉచితంగా చేరువ చేస్తున్న విష‌యం తెలిసిందే. భారతదేశం మొత్తం జనాభాలో 50% కంటే ఎక్కువ మంది ఆర్థిక కొరత కారణంగా సరైన చికిత్సకు నోచుకోవడం లేదు.

PMJAY వారికి సరైన ఆరోగ్య సేవలను పొందడంలో సహాయం చేయడం, వైద్య ఖర్చులను నివారించడం, చివరికి మధ్యతరగతి జనాభా పేదరికాన్ని నివారించడంలో సహాయం చేయడంలక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద లబ్ధిదారుని కుటుంబం సంవత్సరానికి రూ.5 లక్షల ప్రయోజన కవరేజీని పొందుతారు. ఈ పథకం గది ఛార్జీలు, డాక్టర్ ఫీజులు, రోగనిర్ధారణ సేవలు, చికిత్స ఖర్చు, ఐసియు మరియు ఆపరేషన్ థియేటర్ ఖర్చులు మొదలైన వాటితో సహా దాదాపు 1393 విధానాలకు కవరేజీని అందిస్తుంది.
లబ్ధిదారుడు భారతదేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్య సదుపాయాల కోసం క్లయిమ్ చేయవచ్చు.