బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి ఎదురైన షాక్‌పై రాజకీయ విశ్లేషకులు స్పష్టమైన కారణాలను చూపుతున్నారు. ముఖ్యంగా బలహీన స్థితిలో ఉన్న కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ఆర్జేడీకి పెద్ద భారంగా మారిందని అభిప్రాయపడుతున్నారు. స్థానిక స్థాయిలో కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోవడంతో, ఆ పార్టీకి కేటాయించిన స్థానాలు ప్రత్యక్షంగా మహాగఠబంధన్‌కు నష్టాన్ని మిగిల్చాయని విశ్లేషణ వెలువడుతోంది. ఓటర్లలో కాంగ్రెస్‌పై ఉన్న అనాసక్తి, ఆర్జేడీ గెలుపు అవకాశాలను దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు.
Jubilee Results : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంలో కీలక పాత్ర పోషించిన ఉత్తమ్
ఇక స్థానిక సమస్యలను పక్కనబెట్టి అధికంగా “ఓట్ చోరీ”, ఎన్నికల ప్రక్రియలో లోపాలు వంటి అంశాలపై ప్రచారాన్ని కేంద్రీకరించడం కూడా మహాగఠబంధన్ వ్యూహాత్మక తప్పిదంగా చూసారు. బిహార్ ఓటర్లు ప్రాథమిక సమస్యలైన నిరుద్యోగం, అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, స్థానిక వర్గాల ఇబ్బందులను పరిష్కరించే హామీలను కోరుతున్న సమయంలో ఈ విషయాలను ప్రభావితంగా ముందుకు తేవడంలో ఆర్జేడీ విఫలమైందన్నారు. దీంతో ప్రజల దృష్టిలో మార్చి అని అనుకునే నాయకత్వం బలహీనమై, ప్రత్యర్థి కూటమి ప్రచారానికి బలమైన స్థలం దొరికింది.
సాంప్రదాయ ఓటు బ్యాంక్‌పై అత్యధికంగా ఆధారపడటం కూడా ఆర్జేడీ పెద్ద తప్పిదంగా చెప్పబడుతోంది. మారుతున్న రాజకీయ, సామాజిక సమీకరణలను గమనించకపోవడం, కొత్త ఓటర్లను ఆకర్షించే తీరు లేకపోవడం పార్టీని వెనక్కితిరిగేలా చేసింది. గత ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన ఆర్జేడీ, ఈసారి మూడో స్థానానికి పడిపోవడం, పార్టీ వ్యూహంలో జరిగిన మార్పులు, పొత్తుల రాజకీయాలు ఎలా ప్రభావితం చేస్తాయో స్పష్టంగా చూపిస్తోంది. బిహార్ రాజకీయాల్లో ఆర్జేడీకి ఇది ఒక పెద్ద పాఠంగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
