1 Lakh Crores – 2024 : ఈసారి ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు.. ఎందుకు ?

1 Lakh Crores - 2024 : మనదేశంలో 2019 సంవత్సరంలో జరిగిన  లోక్‌సభ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా ? రూ. 55 వేల కోట్లు !!

  • Written By:
  • Updated On - March 24, 2024 / 09:36 AM IST

1 Lakh Crores – 2024 : మనదేశంలో 2019 సంవత్సరంలో జరిగిన  లోక్‌సభ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా ? రూ. 55 వేల కోట్లు !! ఈసారి జరగబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ కలిసి దేశవ్యాప్తంగా దాదాపు  రూ.1 లక్ష కోట్లు ఖర్చు పెట్టబోతున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. 2019 ఎన్నికల ఖర్చులో సగం వాటా అధికార బీజేపీదే. వరుసగా మూడోసారి ఎన్నికల్లో గెలవాలనే  టార్గెట్‌ను పెట్టుకున్న నరేంద్రమోడీ సేన..  ఈసారి అంతకుమించి ఖర్చుపెట్టే అవకాశం ఉంది. ఎన్నికల బాండ్ల ద్వారా గత ఐదేళ్లలో రాజకీయ పార్టీల పొందిన విరాళాల సమాచారాన్ని చూస్తే.. దాదాపు రూ.8వేల కోట్లు ఒక్క బీజేపీకే వచ్చాయి. ఈ డబ్బులన్నీ ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది. ఇక కేసీఆర్‌కు చెందిన భారత రాష్ట్ర సమితి, మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే, ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీలు కూడా ఈసారి ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టేందుకు రెడీ అయ్యాయి.  ఈ పార్టీలకు కూడా ఎన్నికల బాండ్ల ద్వారా భారీగానే విరాళాలు అందాయని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join

ఎన్నికల ఖర్చును పెంచే అంశాలివీ.. 

  • ఎన్నికల ప్రచార సభలకు జనాలను సమీకరించడం, సభ ముగిశాక జనాలను ఇళ్ల వద్ద దిగబెట్టడం ఖర్చుతో కూడుకున్న పని.
  • చిన్న జెండాల నుంచి భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల వరకూ ఎన్నో తయారు చేయించాల్సి ఉంటుంది.
  • ఆఫీస్‌ల రెంట్, కరెంట్ బిల్స్‌ కట్టాల్సి ఉంటుంది.
  •  లోక్‌సభ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల కోసం రాజకీయ పార్టీలు అధికారికంగా కొంత మొత్తాన్ని అందించాల్సి ఉంటుంది.
  • స్టార్ క్యాంపెయినర్లకు రాజకీయ పార్టీలు భారీగానే పేమెంట్స్ చేస్తుంటాయి.
  • గత పదేళ్లుగా రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో ప్రచారానికి బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ వస్తున్నాయి.
  • యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్‌లలో యాడ్స్‌ను రన్ చేయడంపై రాజకీయ పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఇవి కూడా ఖర్చుతో కూడుకున్నవే.
  • టీవీ ఛానళ్లు, న్యూస్ పేపర్లలో ఎలాగూ పార్టీలు యాడ్స్ ఇస్తుంటాయి.
  •  2019లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ 75 రోజుల పాటు కొనసాగింది.  ఇప్పుడు 2024లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ 80 రోజులకుపైగానే కొనసాగనుంది. ఎందుకంటే మొత్తం 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్  జరగనుంది. అన్ని రోజుల పాటు పార్టీలు తమ క్యాడర్‌‌ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే.
  • దేశంలోని 543 నియోజకవర్గాలకు మొత్తంగా 8 వేల మందికిపైగా అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. 670కి పార్టీలు పోటీలో ఉంటున్నాయి.ఈ రేంజులో ఖర్చులు(1 Lakh Crores – 2024) కూడా పెరుగుతాయి.
  • 2029 నుంచి జరిగే అవకాశమున్న జమిలి ఎన్నికల్లో ఖర్చు దాదాపు మూడొంతులు తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు.

Also Read : AI Vs Humans : మనుషుల్లా మాట్లాడుకునే ‘ఏఐ మోడల్స్’ రెడీ.. ఎలా ?