The Kashmir Files: క‌శ్మీరీ పండిట్స్‌కు న్యాయం జ‌రిగిందా..?

  • Written By:
  • Updated On - March 22, 2022 / 02:47 PM IST

ది క‌శ్మీర్ ఫైల్స్ మూవీ గురించి ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌ర‌గుతున్న సంగ‌తి తెలిసిందే. 1990 దశకంలో కశ్మీర్‌లో జరిగిన దారుణ మారణ హింసాకాండకు దృశ్య రూపంగా వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్లు వ‌ర్షం కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆనాడు కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపంగా తెర‌కెక్కిన ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లుతో పాటు, పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కూడా త‌లెత్తుతున్నాయి.

సోష‌ల్ మీడియాలో అయితే ఈ సినిమాపై ఓరేంజ్‌లో టాగ్ ఆఫ్ వార్ సాగుతోంది. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న‌ ప‌లువురు మేథావులు ఈ సినిమాపై కొన్ని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఈ క్ర‌మంలో దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీర‌సైనికుల‌కంటే ఎక్కువ‌గా క‌శ్మీర్ పండిట్‌ల‌కు సానుభూతి వ‌చ్చిందని, 1990లో ఇన్ని ఘోరాలు జ‌రుగుతుంటే అప్ప‌ట్లో బీజేపీ ప్ర‌భుత్వం కూడా దేశాన్ని పాలించింది క‌దా, మ‌రి అప్పుట్లో క‌శ్మీర్ పండితుల‌కు ఏం చార‌ని ప‌లువురు సామాజిక కార్య‌క‌ర్త‌లు, మేథావులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక దేశంలో 2014 నుండి బీజేపీ పాలనలో ఉంది. ఈ క్ర‌మంలోలో 8 ఏళ్ళుగా అధికారంలో బీజేపీ ఉన్న స‌ర్కార్, ఇప్ప‌టి వ‌ర‌కు కశ్మీర్ పండితులను ఎందుకు న్యాయం చేయలేకపోతుందని ప్ర‌శ్నిస్తున్నారు. అలాగే ఆర్టికల్‌ 370 రద్దు అయ్యి ఇప్ప‌టికి నాలుగేళ్లు అయిపోతుంది. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు కశ్మీరీ పండిట్ల జీవితాల్లో ఎందుకు మార్పురాలేదని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. కశ్మీర్ పండితులను తిరిగి కాశ్మీర్ లోయకు బీజేపీ ఎందుకు తీసుకెళ్లలేకపోయిందని కొంద‌రు ప్ర‌శ్నించ‌గా, కశ్మీర్ పండితులను అన్యాయం చేసిన దుర్మార్గులను ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ ప్ర‌భుత్వం ఎందుకు శిక్షించలేకపోయింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ముఖ్యంగా కశ్మీర్‌లో కశ్మీరీ పండిట్స్ పూర్తి ఆత్మభిమానం, ఆత్మ గౌరవంతో జీవించే పరిస్థితిని బీజేపీ ప్ర‌భుత్వం ఎందుకు క‌ల్పించ‌లేక పోయింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అప్పట్లో వాజపేయి ప్రభుత్వం ఆరేళ్ళు పాలించింది క‌దా, మ‌రి అప్పుడు తీవ్రవాదుల దాడుల తర్వాత పండితులకు రక్షణ కల్పించి, క‌శ్మీర్ పండితుల‌ను జమ్మూలో పునరావాసం కల్పించలేక‌పోవ‌డానికి కార‌ణం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. లోయ నుంచి నిర్వాసితులై కశ్మీరీ పండితులను ప్రస్తుతం నివాస ధ్రువీకరణ పత్రం కూడా బీజేపీ ఎందుకు ఇవ్వలేకపొతుందో తెలిపాల‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాకి టాక్స్ మిన‌హాయిస్తే కశ్మీరీ పండితుల సమస్య తీరుతుందా.. హిందువుల కోసం బీజేపీ పని చేస్తుందంటూ పెద్ద పెత్తున ప్ర‌చారం చేస్తూ, వారి సమస్యల్ని మాత్రం పరిష్కరించకుండా, కాశ్మీరీల‌ ఓట్ల కోసం కేవలం ఓట్ల రాజకీయం చేయడం దుర్మార్గం కాదా అని ప్ర‌శ్నిస్తున్నారు. దేశంలో బీజేపీ ప్ర‌భుత్వం.. హిందూ, ముస్లింల మధ్య విభజనను సృష్టించి కశ్మీరీ పండిట్ల సమస్యపై ఎన్నికల్లో లబ్ధి పొందాలని నకిలీ ఆగ్రహావేశాలను పెంచడానికే ది కశ్మీ ర్ ఫైల్స్ సినిమాను రాజకీయంగా వాడుకుంటోందని ప‌లువురు సామాజిక‌వేత్త‌లు ధ్వ‌జ‌మెత్తుతున్నారు. వాస్త‌వానికి సినిమా అన్ని నిజాలే చూపిస్తే, అప్ప‌టి ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు ఇప్ప‌టికీ ఉన్నారు క‌దా.. మ‌రి వారిని ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు శిక్షించ‌లేక‌పోయింద‌ని, బీజేపీ స‌ర్కార్‌ను సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి మ‌త‌ప‌ర‌మైన వితండ‌వాదం చేయ‌కుండా.. ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికీ బీజేపీ ప్ర‌భుత్వం స‌మాదానాలు చెప్ప‌గ‌లదా అని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.