- ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు
- తాజాగా ఇథియోపియా దేశ అవార్డును అందుకున్న ప్రధాని
PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారమైన ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ లభించింది. ఇథియోపియా ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ ఈ గౌరవాన్ని ప్రధానికి అందజేశారు. గత 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాలు తమ అత్యున్నత పురస్కారాలను అందజేశాయి. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్న ప్రధానమంత్రిగా మోదీ రికార్డు సృష్టించారు.
అంతకుముందు ఇదే ఏడాది జూలైలో నమీబియా తన అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’తో ఆయన్ను సత్కరించింది. జూలై పర్యటనలోనే ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఘనా, బ్రెజిల్ దేశాలు కూడా మోదీకి తమ దేశ అత్యున్నత గౌరవాలను అందజేశాయి.
Also Read: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్‌ను తొలగించిన పీసీబీ!
Global Recognition Reflects India’s Progress!
The international honours received by PM @narendramodi reflect India’s steady progress and growing influence. With Ethiopia’s highest civilian award conferred, the total now stands at 28 top civilian honours, and the journey… pic.twitter.com/ir3MYFC1pO
— MyGovIndia (@mygovindia) December 16, 2025
ఏ దేశం ఏ గౌరవాన్ని ఎప్పుడు ఇచ్చింది?
2025లో లభించిన పురస్కారాలు
ఇథియోపియా: గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా
నమీబియా: ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్
బ్రెజిల్: గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్
ట్రినిడాడ్ & టొబాగో: ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో
ఘనా: ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా
సైప్రస్: గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III
శ్రీలంక: శ్రీలంక మిత్ర విభూషణ
బార్బడోస్: ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్
మారిషస్: గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్
2024లో లభించిన పురస్కారాలు
కువైట్: ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్
గయానా: ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్
డొమినికా: డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్
నైజీరియా: గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ నైజర్
రష్యా: ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోస్టల్
భూటాన్: ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో
2023లో లభించిన పురస్కారాలు
గ్రీస్: గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆనర్
ఫ్రాన్స్: లీజియన్ ఆఫ్ ఆనర్
ఈజిప్ట్: ఆర్డర్ ఆఫ్ ద నైల్
ఫిజీ: కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ
పాపువా న్యూ గినియా: ఆర్డర్ ఆఫ్ లోగోహు
పలావు: ఎబాకల్ అవార్డు
ఇతర సంవత్సరాలలో
2020 (అమెరికా): లీజియన్ ఆఫ్ మెరిట్
2019 (UAE): ఆర్డర్ ఆఫ్ జాయెద్
2019 (బహ్రెయిన్): కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైసాన్స్
2019 (మాల్దీవులు): ఆర్డర్ ఆఫ్ ద డిస్టింక్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్
2018 (పాలస్తీనా): గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా
2016 (అఫ్గానిస్థాన్): స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్
2016 (సౌదీ అరేబియా): ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్
