Visakhapatnam: INS విశాఖపట్నం చేరికతో ఇండియన్ నేవీ ఫైర్‌పవర్‌కు పెద్ద ఊపు వచ్చింది.

ఆదివారం ముంబైలోని పశ్చిమ నౌకాదళ కమాండ్‌లో ప్రాజెక్ట్ 15B కింద నాలుగు స్టెల్త్ గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్ షిప్‌ల్లో ఒకటైన INS విశాఖపట్నం చేరికతో ఇండియన్ నేవీ ఫైర్‌పవర్‌కు పెద్ద ఊపు వచ్చింది.

  • Written By:
  • Publish Date - November 21, 2021 / 04:18 PM IST

ఆదివారం ముంబైలోని పశ్చిమ నౌకాదళ కమాండ్‌లో ప్రాజెక్ట్ 15B కింద నాలుగు స్టెల్త్ గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్ షిప్‌ల్లో ఒకటైన INS విశాఖపట్నం చేరికతో ఇండియన్ నేవీ ఫైర్‌పవర్‌కు పెద్ద ఊపు వచ్చింది. రక్షణ తయారీ రంగంలో మరో ఆత్మనిర్భర్ విజయగాథగా భావించే స్వదేశీంగా నిర్మించిన ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు నావికాదళ కమాండర్లు హాజరయ్యారు.

ప్రాజెక్టు 15 బీ సిరీస్(project 15B Series)లో ఈ అత్యాధునిక యుద్ధ నౌక నిర్మాణం జరిగింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో భారత నౌకాదళం అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ నౌకను ఇండియన్ నేవీ రూపకల్పన(డిజైన్) చేసింది. 164 మీటర్ల పొడవు, 7500 టన్నుల బరువు ఉన్న ఈ యుద్ధ నౌక.. 30 నాటికల్ మైళ్ల గరిష్ఠ వేగంతో నీలి జలాలపై పరుగులు తీస్తుంది. యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే విధంగా.. ఆయుధ సామగ్రిని అమర్చేందుకు వీలుగా విశాలమైన డెక్ ఉంటుంది.

Also Read: రక్షణ రంగంలోకి నూతన నౌకలు