Site icon HashtagU Telugu

Parliament: పార్లమెంట్‍పై దాడి చేసిన నిందితులు గుర్తింపు

2 Visitors Jump Into Lok Sabha Chamber

2 Visitors Jump Into Lok Sabha Chamber

Parliament: పార్లమెంటు జీరో అవర్ లో ఇద్దరు వ్యక్తులు గుర్తుతెలియని లోపలికి ప్రవేశించి దాడి చేశారు. పసుపు రంగులో గ్యాస్ ను వెదజల్లుతూ పొగ డబ్బాలతో సందర్శకుల గ్యాలరీ నుంచి దూకి లోక్ సభ ఛాంబర్ లోకి దూసుకెళ్లారు. భారీ భద్రతను ఛేదించుకుంటూ ముందుకు వెళ్లారు. సందర్శకుల గ్యాలరీలో గ్యాస్ లీక్ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు హౌస్ సీసీటీవీ రికార్డయ్యాయి. వీరిద్దరినీ లోక్ సభ ఎంపీలు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటన దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది.

అయితే పార్లమెంట్‍పై దాడి చేసిన నిందితులు గుర్తింపు లభించింది.  నీలం, అమోల్ షిండేగా పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించారు.  మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా పేరుతో పాసులు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. సాగర్ శర్మ పేరుతో నిందితుడు పాసును పొందాడు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

ఇరవై రెండు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున దిల్లీలోని పార్లమెంటు భవనంలో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో అప్పటి ప్రధానమంత్రితో సహా పార్లమెంటు సభ్యులు, పార్టీల అగ్రశ్రేణి నాయకత్వం అక్కడే ఉన్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రోత్సాహ లష్కర్ ఏ తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు మారణాయుధాలతో పార్లమెంటు భవనంపై ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు పార్లమెంటు భవన భద్రతా సిబ్బంది వీరోచితంగా పోరాడారు.