దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతోంది

Hydrogen Powered Train భారతదేశ మొట్టమొదటి హైడ్రోజన్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ హైడ్రోజన్ రైలు సిద్ధం కాగా.. హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో జనవరి 26వ తేదీన ట్రయల్ రన్ ప్రారంభించనుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే ఈ అత్యాధునిక రైలు.. కాలుష్యాన్ని సున్నాకు తగ్గిస్తూ పర్యావరణ విప్లవానికి నాంది పలకనుంది. ఈ హైడ్రోజన్ రైలు అందుబాటులోకి వస్తే.. జర్మనీ, చైనా వంటి దేశాల తర్వాత ఈ టెక్నాలజీని […]

Published By: HashtagU Telugu Desk
India's first Hydrogen train ready for pilot run on Jind–Sonipat in Haryana

India's first Hydrogen train ready for pilot run on Jind–Sonipat in Haryana

Hydrogen Powered Train భారతదేశ మొట్టమొదటి హైడ్రోజన్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ హైడ్రోజన్ రైలు సిద్ధం కాగా.. హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో జనవరి 26వ తేదీన ట్రయల్ రన్ ప్రారంభించనుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే ఈ అత్యాధునిక రైలు.. కాలుష్యాన్ని సున్నాకు తగ్గిస్తూ పర్యావరణ విప్లవానికి నాంది పలకనుంది. ఈ హైడ్రోజన్ రైలు అందుబాటులోకి వస్తే.. జర్మనీ, చైనా వంటి దేశాల తర్వాత ఈ టెక్నాలజీని సొంతం చేసుకున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలవనుంది.

పర్యావరణ హితమైన రవాణా దిశగా భారత రైల్వే శాఖ మరో భారీ ముందడుగు వేసింది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును పట్టాలెక్కించేదుకు సర్వం సిద్ధం చేసింది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి హర్యానాలోని జింద్ నగరం వేదిక కాబోతోంది. ఈ హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్, సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మేర ప్రయాణించనుంది. ఈ హైడ్రోజన్ రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ వేగం ప్రస్తుతం అందుబాటులో ఉన్న డీజిల్ రైళ్ల కంటే వేగంగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ హైడ్రోజన్ రైలు తొలి ట్రయల్ రన్ ప్రారంభం కానుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది?

ఈ హైడ్రోజన్ రైలు నీటి నుంచి ఇంధనాన్ని తయారు చేసుకుని పరుగులు తీస్తుంది. ఈ రైలుకు అవసరమైన హైడ్రోజన్ ఇంధనం కోసం జింద్‌లో ఒక ప్రత్యేక ప్లాంట్‌ను నిర్మించారు. సుమారు 9 లీటర్ల నీటిని విద్యుత్ విశ్లేషణ చేయడం ద్వారా 900 గ్రాముల హైడ్రోజన్‌ను తయారు చేస్తారు. ఈ 900 గ్రాముల హైడ్రోజన్.. రైలును 1 కిలోమీటర్ దూరం నడిపించేందుకు సరిపోతుంది.

ఈ రైలు పొగకు బదులుగా కేవలం నీటి ఆవిరి, వేడిని మాత్రమే విడుదల చేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ హైడ్రోజన్ రైలు.. డీజిల్ ఇంజిన్ల లాగా భారీ శబ్దాలు చేయకుండా.. మెట్రో రైలు లాగా చాలా నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంది.

హైడ్రోజన్ రైలు విశేషాలు

ఈ హైడ్రోజన్ రైలును తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) లో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారు. ఈ హైడ్రోజన్ రైలులో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. అందులో 2 డ్రైవింగ్ పవర్ కార్లు, 8 ప్యాసింజర్ కోచ్‌లు ఉంటాయి. ఈ హైడ్రోజన్ రైలు ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులను మోసుకెళ్లగలదు.

అంతేకాకుండా ఈ రైలులో ఆధునిక వసతులను ప్రయాణికులకు అందించనున్నారు. మెట్రో రైళ్ల తరహాలో ఆటోమేటిక్ డోర్లు, డిజిటల్ డిస్‌ప్లేలు, ఏసీ, ఎల్‌ఈడీ లైటింగ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ రైలు టికెట్ ధర సాధారణ ప్యాసింజర్ రైళ్ల మాదిరిగానే రూ. 5 నుంచి ప్రారంభమై రూ. 25 మధ్య ఉండే అవకాశం ఉందని రైల్వే శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది.

  Last Updated: 08 Jan 2026, 04:41 PM IST