Site icon HashtagU Telugu

India Bullet Train :భూకంపాలు తట్టుకునేలా బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌.. కొత్త అప్ డేట్స్ ఇవీ

India Bullet Train

India Bullet Train

India Bullet Train : మనదేశపు తొలి బుల్లెట్‌ ట్రైన్‌ కోసం రైల్వే ట్రాక్ రెడీ అవుతోంది. 

రూ.1.60 లక్షల కోట్ల బడ్జెట్ తో అహ్మదాబాద్ (గుజరాత్)  – ముంబై (మహారాష్ట్ర) మధ్య దాని నిర్మాణ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి..  

ఈ ట్రాక్  రెడీ అయితే మన మొట్టమొదటి బుల్లెట్  ట్రైన్ గంటకు 300 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది.   

ఈ ట్రైన్‌ రూట్ నిర్మాణ పనులపై ఒక రిపోర్ట్.. 

దేశపు తొలి బుల్లెట్ ట్రైన్(India Bullet Train) కోసం అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు 508 కి.మీ మేర హైస్పీడ్  రైల్వే ట్రాక్ రెడీ అవుతోంది. మధ్యలో ట్రైన్ హాల్ట్ కోసం 12 రైల్వే స్టేషన్‌ల నిర్మాణం కూడా జరుగుతోంది. ఈ రూట్ లో రైల్వే ట్రాక్ నిర్మాణంలో భాగంగా వందలాది తెల్లటి రంగు పిల్లర్లను ఏర్పాటు చేశారు. ఈ పిల్లర్లపై ఒక్కొక్కటి  975 టన్నుల బరువు, 40 మీటర్ల పొడవున్న ఇనుప దూలాలను(గిర్డర్‌) అమరుస్తున్నారు.  పిల్లర్లపైకి ఈ భారీ ఇనుప దూలాలను ఎత్తడానికి 216 చక్రాల భారీ ట్రక్కును వినియోగిస్తున్నారు. ఈ ఎండల్లోనూ పనులు చకచకా జరుగుతూనే ఉన్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ కార్మికులు చెమటలు కక్కుతూ పనులు చేస్తున్నారు. ఈ ట్రైన్ ప్రాజెక్టు వల్ల గుజరాత్, మహారాష్ట్రల్లో దాదాపు 60 వేల మందికి ఉపాధి లభిస్తోంది.

Also read : Maharastra: మహారాష్ట్రలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం.. 22 వేల చెట్లు నరికివేత?

భూకంపాలు తట్టుకునేలా ట్రాక్‌

బుల్లెట్ రైలు పట్టాల కింద మెయిన్  సపోర్ట్ గా ఉండే గిర్డర్‌ లను తయారు చేసే కర్మాగారాలను ‘కాస్టింగ్ యార్డ్‌లు’ అంటారు. ఈ ట్రైన్ రూట్ పనుల కోసం మార్గం పొడవునా 25 కాస్టింగ్ యార్డులు నిర్మించారు. మొత్తం 25 కాస్టింగ్ యార్డుల విస్తీర్ణం దాదాపు 1000 ఎకరాలు. కాస్టింగ్ యార్డ్‌లలో  పగలు, రాత్రి మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగుతున్నాయి.ఈ గిర్డర్ ల కేజ్ డిజైన్, డ్రాయింగ్ ను జపాన్‌లో తయారు చేయించారు. హై స్పీడ్ రైలు మొత్తం ట్రాక్‌ను భూకంపాలు తట్టుకునేలా తయారు చేస్తున్నారు. ఇందుకోసం రైల్వే ట్రాక్ లో సీస్మిక్ స్టాపర్లను అమరుస్తున్నారు. భూకంపం సంభవించినప్పుడు ప్రాథమిక, ద్వితీయ అనే 2 రకాల అలలు ఉత్పన్నమవుతాయి. ప్రాథమిక భూకంప తరంగం ఏర్పడితే రైల్వే ట్రాక్ లో అమర్చిన భూకంప సూచికలు వాటిని గుర్తించి, కొన్ని సెకన్ల వ్యవధిలోనే సబ్‌స్టేషన్‌లోని విద్యుత్‌ను ట్రిప్ చేస్తాయి. దీని కారణంగా బుల్లెట్  ట్రైన్ కు ఎమర్జెన్సీ బ్రేక్స్ పడతాయి. ఫలితంగా రైలు ఎక్కడుందో అక్కడే ఆగిపోతుంది.

Also read : Bullet Train To Space: చంద్రుడు, అంగారకుడిపైకి బుల్లెట్ ట్రైన్.. జపాన్ యోచన!!

సబర్మతిలో బుల్లెట్ రైలు దిగగానే..

సూరత్‌కు 200 కి.మీ దూరంలోని వక్తానా గ్రామం దగ్గర 42 ఎకరాల్లో నిర్మించిన  కాస్టింగ్ యార్డ్ లో చైనా, దక్షిణ కొరియా నుంచి తెప్పించిన అత్యాధునిక రైల్వే ట్రాక్ మెషీన్లను వాడుతున్నారు.  ఈ మొత్తం ట్రైన్ రూట్ లో నదులపై 23 వంతెనలు నిర్మించనున్నారు. వీటిలో 19 వంతెనలు గుజరాత్‌లో, 4 వంతెనలు మహారాష్ట్రలో ఉంటాయి . వీటిలో 5 కాంక్రీటు వంతెనలు, 12 ఉక్కు వంతెనలు. భరూచ్ జిల్లాలో నర్మదా నదిపై 1.26 కిలోమీటర్ల పొడవైన వంతెనను నిర్మిస్తున్నారు. గుజరాత్ లోని సబర్మతిలో బుల్లెట్ రైలు దిగగానే ఎదురుగా ఫైవ్ స్టార్ హోటళ్లు, ఫుడ్ కోర్టులు, వాణిజ్య దుకాణాలు ఉండేలా నిర్మాణాలు చేయనున్నారు.  దీనికి సంబంధించిన 9 అంతస్తుల భవనం నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి.