Rajastan : ఖర్గేకు రక్తంతో లేఖ రాసి పంపించిన కాంగ్రెస్ నేత..!!

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 07:00 AM IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజస్తాన్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు రక్తంతో రాసిన లేఖను పంపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంపై వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. సెప్టెంబర్ లో ఏం జరిగిందో మీకు తెలుసనని లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్ ల రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రతో రాజస్థాన్ కు రానున్నారు. రాజస్థాన్ విషయంలో మీరు వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటారని సాధారణ పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారని సర్వబ్రహ్మణ మహాసభ జాతీయ అధ్యక్షుడు సురేశ్ మిశ్రా కోరారు.

రాజస్థాన్ లో 52 రోజుల నుంచి ఇంకా గందరగోళ పరిస్ధితి ఉంది. అజయ్ మాకెన్ కూడా నిర్ణయం తీసుకోవడంతోనే రాజీనామా చేశారు. రాజస్తాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మెజార్టితో అధికారంలో కొనసాగేలా రా
ష్ట్రం అభివృద్ధి చెందేలా ఆయన లేవనెత్తిన అంశాలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. నా రక్తంతో రాసిన ఈ లేఖను చదివిన తర్వాత కాంగ్రెస్ సాధారణ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉందంటూ లేఖలో పేర్కొన్నారు మిశ్రా. రాజస్థాన్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని,.ఇప్పుడు ఉన్న గందరగోళ పరిస్ధితులకు ముగింపు పలకాలని కోరారు.