Site icon HashtagU Telugu

KCR: భారత బిడ్డను.. బరాబర్ మహారాష్ట్ర వస్తా

KCR

The Child Of India.. Will Always Come To Maharashtra.. Kcr

KCR : ‘తెలంగాణ సీఎంకు మహారాష్ట్రలో ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు చెబుతున్నా, నేను భారతదేశ బిడ్డను.. నేను మహారాష్ట్ర రాకుండా ఉండాలంటే తెలంగాణ తరహాలో అభివృద్ధి చేస్తే రానని ప్రకటిస్తున్నా’ అని కేసీఆర్ (KCR) ప్రకటించారు. ఆదివారం జరిగిన్ లోహ సభలో రైతు రాజ్యం దేశంలో రాబోతుందని అన్నారు. కాంగ్రెస్ బీజేపీలతో మన బతుకులు మారాయా? కాంగ్రెస్ 54 ఏళ్లు బీజేపీ 14 ఏళ్ల పాటు పాలించి ఏం చేశాయి.? దేశంలో సంవృద్ధిగా సహజ వనరులున్నాయని అన్నారు.’అమెరికా చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉంది.ఏటా 40వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా గోదావరి నదులు ఉన్నా రైతులకు ఎందుకు మేలు జరగడం లేదు. నేతలు తలుచుకుంటే దేశంలో ప్రతీ ఎకరాకు నీరు ఇవ్వొచ్చు. దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉందని.. దీంతో 24 గంటల కరెంట్ ఇవ్వొచ్చని కేసీఆర్ అన్నారు.

ఈ సందర్భంగా ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ రావు దోండే సహా పలువురు మరాఠా నేతలను గులాబీ కండువా కప్పి కేసీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే రైతుల సమస్యలను పరిష్కరిస్తామని KCR హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని లోహాలో బీఆర్ఎస్ సభకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల తుఫాన్ అడ్డుకోలేరని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ తరహాలో అభివృద్ధి చేస్తే మళ్లీ మహారాష్ట్ర రానని కేసీఆర్ ప్రకటించారు.

రైతుల తుఫాన్ రాబోతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో . రైతుల తుఫాన్ ను దేశంలో ఎవరూ ఆపలేరని బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ‘ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ముందుకెళుతున్నామని కేసీఆర్ ప్రకటించారు.

Also Read:  Jagan is Great: జగన్ మంచోడే.! సజ్జలే చేటు!! రెబెల్స్ వాయిస్