Site icon HashtagU Telugu

Cheapest Rover : గ్రహాలపై హల్‌‌‌చల్ చేయగల ‘రోవర్’.. లక్షన్నరే

Cheapest Rover

Cheapest Rover

Cheapest Rover : అంగారకుడు, చంద్రుడు వంటి వాటిపై తిరుగుతూ శాంపిల్స్‌ను సేకరించే రోవర్ల తయారీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రహాల పైనుంచి భూమికి కమ్యూనికేషన్‌ను నెరుపుతూనే, అక్కడి శాంపిల్స్‌ను సేకరించే రోవర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈనేపథ్యంలో గుజరాత్‌లోని సూరత్​లో ఉన్న  సర్దార్​ వల్లభాయ్ నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీకి చెందిన బీటెక్ విద్యార్థులు అతి తక్కువ ఖర్చుతో ఒక రోవర్‌ను రెడీ చేశారు. కేవలం లక్షన్నర రూపాయలతో ‘అగస్త్య’ అనే పేరు కలిగిన రోవర్‌ను తయారు చేశారు.

25 మంది విద్యార్థుల టీమ్..

సూరత్ ఎన్ఐటీలోని అన్ని బ్రాంచ్​లకు చెందిన 25 మంది విద్యార్థుల టీమ్ కేవలం నాలుగు నెలల్లోనే ఆధునిక సాంకేతికతతో డెవలప్ చేయడం విశేషం. సాధారణంగా రోవర్ తయారీకి రూ.6 లక్షల దాకా ఖర్చవుతుంది. కానీ ఈ ఖర్చును గణనీయంగా తగ్గించడంలో సూరత్ ఎన్ఐటీ స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు. ఇంటర్నేషనల్ రోవర్​ ఛాలెంజ్ ఛాంపియన్​షిప్​ పోటీలలోనూ మొదటి రౌండ్​ను అగస్త్య రోవర్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. వచ్చే ఏడాది కోయంబత్తూరులో జరిగే రెండో రౌండ్ పోటీల్లో దేశాల రోవర్లతో అగస్త్య  తలపడనుంది.

We’re now on WhatsApp. Click to Join.