సామాన్య ప్రజలు, యువతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. దేశంలో సింగిల్ సిగరెట్లను (Cigarette) విక్రయించడాన్ని నిషేధించాలని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది. వ్యక్తిగత సిగరెట్ స్టిక్స్ (Cigarette Sticks), అన్ టైడ్ పొగాకు ఉత్పత్తులను తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులు, యువతే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇలా విడి విడిగా ఒక్కొక్కటి కొనుగోలు చేయడం వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో ఈ విడి ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అటువంటి విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే ఇది అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
భారతదేశం (India) లో చాలా మంది ధూమపానం (Smoking) చేసేవారు మొత్తం ప్యాక్ లకు బదులుగా విడి విడిగా సిగరేట్లను ఒకటి రెండు కొనుగోలు చేస్తారు. ఈ కారణంగా, చాలా మంది యువకులు ధూమపానానికి అలవాటు పడ్డారు, అంతేగాక, తీవ్రమైన అన్నారోగ్య బారిన పడుతున్నారు. ధూమపానం (Smoking) బెడదను అరికట్టేందుకు విమానాశ్రయాల్లోని స్మోకింగ్ జోన్లను మూసివేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. సాధారణ బడ్జెట్డ్జె లో పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంపు ఉంటుందన్న ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. వాటి ప్రకారం, అన్ని పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే ఆదాయాన్ని పెంచే అవసరాన్ని పరిష్కరించడానికి చాలా ప్రభావంతమైన విధానం. ఇది ఆదాయాన్ని సంపాదించడానికి, పొగాకు వినియోగం, సంబంధిత వ్యాధులను తగ్గించడానికి విజయవంతమైన ప్రతిపాదనగా చెబుతున్నారు.
అన్ని పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. పొగాకు ఉత్పత్తులను తక్కువ ధరలో ఉండటం వల్లే యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయం ఒకవైపు ప్రభుత్వ ఆదాయాని పెంచడంతో పాటు, మరో వైపు యువతను పొగాకు దూరం చేస్తుందని భావిస్తున్నారు. దీంతో లక్షలాది మంది సామాన్యులు, యువత పొగాకు దూరమవుతారని అంటున్నారు.
Also Read: PAN Card: పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడానికి తుది గడువు మార్చి 31..!