Jails: ఖైదీలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వారు విడుదలకు రంగం సిద్ధం!

Jails: తప్పు చేసిన వారికి శిక్ష పడక తప్పదు. న్యాయప్రకారం వారికి కోర్టులు తగిన శిక్షలు విధిస్తాయి. అయితే శిక్ష కాలం పూర్తయినా కూడా చాలా మంది ఇంకా జైళ్లలోనే ఉన్నారు.

  • Written By:
  • Updated On - December 21, 2022 / 09:22 PM IST

Jails: తప్పు చేసిన వారికి శిక్ష పడక తప్పదు. న్యాయప్రకారం వారికి కోర్టులు తగిన శిక్షలు విధిస్తాయి. అయితే శిక్ష కాలం పూర్తయినా కూడా చాలా మంది ఇంకా జైళ్లలోనే ఉన్నారు. వారి పరిస్థితి దారుణంగా ఉంది. కోర్టులు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తాయి. అయితే కొందరు ఖైదీలు తమ శిక్షను అనుభవించిన తర్వాత జరిమానా కట్టకుండా ఉంటున్నారు. ఇలా జరిమానా కట్టకుండా ఉన్నవారు కూడా ఇప్పటికీ జైళ్లలోనే మగ్గుతున్నారు. తాజాగా వీరికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

శిక్ష పూర్తయినా ఇంకా జరిమానా కట్టని వారిని జైలు నుంచి వదిలేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు ఆదేశాలను కూడా అందజేసింది. కేంద్ర హొమ్ శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ ను కాంగ్రెస్ నాయకులు జైలు ఖైదీలకు సంబంధించి పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి ఆయన సమాధానం ఇచ్చారు.

శిక్ష కాలం పూర్తయినా జరిమానా కట్టకుండా జైళ్లలో మగ్గుతున్న వారి కోసం కేంద్రం ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చిందని, అలాంటి వారిని ఆగస్టు 15వ తేది 2022, జనవరి 26వ తేది 2023, ఆగస్టు 15వ తేది 2023వ రోజుల్లో విడుదల చేసేందుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా 80 శాతం మంది విచారణ ఖైదీలు ఉన్నారని, వారిని తగ్గించేందుకు కేంద్రం పలు రకాల చర్యలు తీసుకుందని తెలిపారు. జైళ్లలో ఖైదీల జీవితం మగ్గిపోకుండా వారి కుటుంబాలతో ఒక రోజు కలిసి ఉండేలా పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రవర్తన బాగుపడినవారిని కూడా శిక్ష తగ్గించి విడుదల చేస్తున్నామని, ఇదంతా న్యాయ ప్రకారంగానే జరుగుతోందని పేర్కోన్నారు.