Site icon HashtagU Telugu

PF : పీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

India Post Payments Bank

India Post Payments Bank

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) నిల్వలపై వడ్డీ రేటును 8.25 శాతంగా ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్రం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వడ్డీ రేటు ఫిబ్రవరి 28, 2025న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సూచనతో సమ్మతించబడింది. గత సంవత్సరం కూడా ఇదే వడ్డీ రేటు వర్తించింది. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 7 కోట్ల మంది ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ త్వరలో జమ కానుంది.

Deputy CM Bhatti : 56వేల ఉద్యోగాలిచ్చాం.. యువతకు మంచి భవితే మా లక్ష్యం : భట్టి

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోసం తమ జీతంలోనుండి కొంత భాగాన్ని పొదుపుగా ఉంచుకునే ప్రభుత్వ పథకం. ఉద్యోగి మరియు యజమాని ఇద్దరూ నెలవారీగా ఈపీఎఫ్ ఖాతాకు 12 శాతం చొప్పున తమ వాటాను చెల్లిస్తారు. ఇందులో ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్‌కి వెళ్లినప్పటికీ, యజమాని వాటాలో 3.67 శాతం ఈపీఎఫ్‌కు, మిగతా 8.33 శాతం ఈపీఎస్ (పెన్షన్ స్కీం) కి వెళ్తుంది. అదనంగా, యజమాని ఉద్యోగి కోసం EDLI (ఇన్సూరెన్స్) పథకానికి గరిష్టంగా రూ.75 చెల్లిస్తారు. ఈ స్కీం ద్వారా ఉద్యోగి మరణించినట్లయితే, అతని కుటుంబానికి రూ.7 లక్షల బీమా కవరేజ్ లభిస్తుంది.

Shami- Iyer: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ!

మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా సులభం. దీనికి ఉమాంగ్ (UMANG) యాప్, EPFO వెబ్‌సైట్, మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ సేవలు ఉపయోగించుకోవచ్చు. ఉమాంగ్ యాప్ ద్వారా మీ యూఏఎన్ (UAN) మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే, EPFO వెబ్‌సైట్‌లోకి వెళ్లి UAN, పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వండి. మిస్డ్ కాల్ కోసం 9966044425 నంబర్‌కి కాల్ చేయండి లేదా 7738299899 నంబర్‌కు EPFOHO UAN అని మెసేజ్ చేయండి. ఈ విధంగా మీరు ఎప్పుడైనా మీ పీఎఫ్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

Exit mobile version