బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ ట్రస్ట్ షాకింగ్ డెసిషన్.. ఇక వాళ్ళకి నో ఎంట్రీ

Chardham Yatra 2026  ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయాలలోకి ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. చార్‌ధామ్ దేవాలయాలలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ (కేబీటీసీ) బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో ప్రతిపాదనలకు ఆమోదం ప్రతిపాదించిన ఆలయ కమిటీ బోర్డు బోర్డు పరిధిలోకి వచ్చే ఇతర ఆలయాల్లోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని […]

Published By: HashtagU Telugu Desk
Chardham Yatra 2026

Chardham Yatra 2026

Chardham Yatra 2026  ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయాలలోకి ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. చార్‌ధామ్ దేవాలయాలలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ (కేబీటీసీ) బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు.

  • త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో ప్రతిపాదనలకు ఆమోదం
  • ప్రతిపాదించిన ఆలయ కమిటీ బోర్డు
  • బోర్డు పరిధిలోకి వచ్చే ఇతర ఆలయాల్లోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని వెల్లడి
కేబీటీసీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది ఈ విషయంపై మాట్లాడుతూ, ఈ రెండు ఆలయాలతో పాటు కమిటీ పరిధిలోకి వచ్చే ఇతర దేవాలయాల్లోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపారు.

ఇదివరకే గంగోత్రిధామ్‌లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించారు. ఆదివారం జరిగిన గంగోత్రి టెంపుల్ కమిటీ సమావేశంలో దీనిపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేబీటీసీ ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే ఈ నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయంపై నిర్ణయం వెలువడాల్సి ఉంది.

  Last Updated: 26 Jan 2026, 03:25 PM IST