Lok Sabha : లోక్ సభ ఫై దాడి..కొన్ని నెలల ముందుగానే ప్లాన్ – విచారణలో బయటపడ్డ నిజాలు

  • Written By:
  • Publish Date - December 14, 2023 / 12:12 PM IST

నిన్న బుధువారం లోక్ సభ (Lok sabha) జరుగుతుండగా ఇద్దరు ఆగంతకులు లోనికి చొరపడి గ్యాస్ లీక్ (Gas Leak)చేసి అందర్నీ భయబ్రాంతులకు గురి చేసిన సంగతి తెలిసిందే. భద్రత వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగినట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇక ఈ దాడికి పాల్పడిన అగంతకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణ లో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ దాడి అనేది అప్పటికప్పుడు అనుకోని చేసింది కాదని , కొన్ని నెలల ముందుగానే ప్లాన్ చేసినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మొత్తం ఆరుగురు నిందితులు ఈ స్కెచ్ వేసినట్టు వెల్లడించారు. వీరిలో ఐదుగురిని అరెస్ట్ చేశామని, మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అయితే…అదుపులో ఉన్న ఐదుగురినీ విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడికి కారణాలేంటో ఆ నిందితులు వివరించినట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం దృష్టిని తమవైపు మరల్చడంతో పాటు కొన్ని కీలస సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి చేసినట్టు వాళ్లు అంగీకరించినట్టు సమాచారం. నిరుద్యోగం, రైతుల సమస్యలు, మణిపూర్ హింస లాంటి అంశాలపై ఆ నిందితులు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కావాలనే కలర్ స్మోక్‌ని సభలో వదిలామని, అలా అయినా తమ సమస్యలేంటో ప్రభుత్వం తెలుసుకుని వాటిపై చర్చిస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేశామని తెలిపినట్లు పోలీసులు చెపుతున్నారు. ఈ ఘటనలో మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్ , అమోల్ శిందే, విశాల్, లలిత్ లు పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పార్లమెంటు భవనంలోకి చొరబడి దాడి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అతి పెద్ద భద్రతా వైఫల్యంగా పేర్కొంటూ ఎనిమిది మంది సిబ్బందిపై వేటు వేసింది.

Read Also : CM Jagan : YSR సుజలధార ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్‌