పహల్గామ్(Pahalgam Terror Attack)లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత-పాకిస్తాన్ మధ్య తిరిగి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర ఉందని భారత ఆరోపణలతో ప్రారంభమైన ఈ ఉద్రిక్తతలు నియంత్రణ రేఖ (LoC) ప్రాంతంలో కాల్పులకు దారి తీశాయి. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుప్వారా, యూరీ, అఖ్నూర్ సెక్టార్‌ల పరిధిలో పాకిస్తాన్ సైన్యం తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరిపింది. భారత జవాన్లు వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టారు.
Vehicle Driving Test : డ్రైవింగ్ టెస్ట్ మరింత టఫ్.. ఇక ‘సిమ్యులేటర్’పైనా నెగ్గాల్సిందే
గత కొన్ని వారాలుగా పాకిస్తాన్ ఉల్లంఘిస్తున్న తొమ్మిదో కాల్పుల ఘటనగా గుర్తించబడింది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత సరిహద్దుల్లో శాంతి లేకుండా పాకిస్తాన్ పక్కా వ్యూహంతో రెచ్చిపోతున్నట్లు అనిపిస్తోంది. భారత్‌తో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ వరుసగా ఉల్లంఘిస్తూ వస్తోంది. ఉగ్రదాడులకు పరోక్ష మద్దతుగా, సరిహద్దుల్లో దౌర్జన్యాలకు పాల్పడుతున్న చర్యలపై భారత్ ఆగ్రహంగా ఉంది. పాకిస్తాన్ తీరు భారత ఆర్మీ సహనానికి పరీక్షగా మారింది.
భారత్-పాకిస్తాన్ మధ్య మొత్తం 3,323 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇందులో 2,400 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్ నుండి జమ్మూవరకు విస్తరించి ఉంది. మరో 740 కిలోమీటర్లు జమ్మూ నుండి లఢక్ వరకు నియంత్రణ రేఖగా ఉంది. సియాచిన్‌లో 110 కిలోమీటర్ల యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ ఉన్నది. ఈ సరిహద్దులన్నింటి పొడవునా పాకిస్తాన్ జవాన్లు కాల్పులకు తెగబడటంతో, భారత్ తగినదిగా స్పందించేందుకు సిద్ధమవుతోంది. దేశ భద్రతకోసం భారత ఆర్మీ తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.