Site icon HashtagU Telugu

PM Modi : ప్రజలను దోపిడీ చేయడమే ఆ కూటమి ఉద్దేశం : ప్రధాని మోడీ

PM Modi Aircraft

PM Modi Aircraft

Maharashtra Assembly Election : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో భాగంగా ధులేలో ప్రధాని మోడీ ఈరోజు మాట్లాడుతూ..మహారాష్ట్రలోని విపక్ష కూటమి ‘మహా వికాస్ అఘాడి’ పై విమర్శలు గుప్పించారు. ఎంపీఏను చక్రాలు, బ్రేకుల్లేని బండిగా పోల్చారు. తప్పుడు పాలన, ప్రజలను దోపిడీ చేయడమే ఆ కూటమి ప్రధాన ఉద్దేశమని అన్నారు. వారి (విపక్షాలు) లక్ష్యం ఒకటే. ప్రజలను లూటీ చేయడం. దేశంలోని గిరిజన తెగల మధ్య చీలికలు తేవడమే కాంగ్రెస్ ఎజెండా. మతపరమైన సంస్థలతో కలిసి కాంగ్రెస్ సాగిస్తున్న కుట్ర దేశ విభజనకు దారితీస్తుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ కేటరిరిలను ఒకరిపై మరొకరిని కాంగ్రెస్ రెచ్చగొడుతోంది.

ఇండియాలో ఇంతకంటే పెద్ద కుట్ర ఉండదు. ప్రజలంతా ఐకమత్యంతో బలంగా ఉండాలి. ఐకమత్యమే మహాబలం. ఇది అందర్నీ ఏకతాటిపై ఉంచుతుంది అని మోడీ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రధాని ప్రశంసించారు. తిరిగి ఇదే ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి పనులు ముందుకు దుసుకువెళ్తాయని చెప్పారు. మహాయుతి కూటమిలోని ప్రతి అభ్యర్థికి ప్రజల ఆశీస్సులు కావాలని, గత 2.5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని కొనసాగించేందుకు తాను భరోసాగా నిలుస్తానని అన్నారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధిని సరికొత్త పుంతలు తొక్కిస్తామని వాగ్దానం చేశారు. మహిళా సాధికారతతోనే ‘వికసిత్ భారత్’ సాధ్యమని మరోసారి ప్రధాని స్పష్టం చేశారు. మహిళా ప్రగతితోనే సమాజం పురోగమనిస్తుందని, మహిళా సాధికారతకు ఉన్న అవరోధాలన్నీ తాను తొలగించానని, కేంద్ర విజన్‌ను మహాయుతి ప్రభుత్వం పరిపుష్టం చేస్తుందని చెప్పారు.

లడ్కీ బహన్ యోజనను ఆపేందుకు విపక్షాలు కోర్టులు కూడా వెళ్లారని, వాళ్లకు అధికారం ఇస్తే ఆ స్కీమ్‌ను ఆపేస్తారని అన్నారు. ఎంవీఏ పట్ల ప్రతి మహిళ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలకు సాధికారత ఇవ్వడం వారికి ఇష్టముండదని, మహిళలపై ఆనేతలు ఎలాంటి పరుషపదజాలం వాడుతున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారని పరోక్షంగా ఇటీవల శివసేన యూబీటీ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలపై విమర్శించారు. కాగా, నాసిక్‌లోనూ ప్రధాని శుక్రవారనాడు ప్రసంగించనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 20న జరుగనుండగా, 23న ఫలితాలు వెలువడతాయి.

Read Also: Sea Plane : విజయవాడ – శ్రీశైలం “సీ ప్లేన్” ట్రయల్ రన్ విజయవంతం