Thalapathy Vijay : సీఏఏ అమలుపై స్పందించిన తలపతి విజయ్

  • Written By:
  • Publish Date - March 12, 2024 / 01:13 PM IST

 

Thalapathy Vijay : పౌరసత్వ సవరణ చట్టం (CAA) ఆమోదయోగ్యం కాదని తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, హీరో దళపతి విజయ్‌( Thalapathy Vijay) విమర్శించారు. అమలులోకి తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నాలుగేండ్ల క్రితం ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను బీజేపీ(bjp) ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, దీని కోసం వెబ్‌ పోర్టల్‌ను కూడా సిద్ధం చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఇప్పుడు అమలుచేస్తున్నారని విమర్శిస్తున్నాయి.

read also : Chiranjeevi : విశ్వంభర తర్వాత చిరు ఎవరితో అంటే..!

ఈ నేపథ్యంలో సీఏఏపై తమిళ నటుడు, టీవీకే నేత విజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రజలందరూ మత సామరస్యంతో జీవిస్తున్న వాతావరణంలో.. విభజన రాజకీయాల స్ఫూర్తితో అమలు చేస్తున్న భారత పౌరసత్వ సవరణ చట్టం-2019 ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. తమిళనాడులో ఈ చట్టాన్ని అమలు చేయబోమని పాలకులు హామీ ఇవ్వాలని విజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీ పెట్టిన విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పోటీచేయదని, ఎవరికీ మద్దతు ఇవ్వదని విజయ్ చెప్పారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.