జమ్మూ కశ్మీర్(J&K)లో ఉగ్రవాదుల కదలికలు మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఉదయం ఉధంపూర్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పులు ఉద్రిక్తతను పెంచాయి. ఈ ఘటనలో ఒక ఆర్మీ జవాను గాయపడ్డారు. సమాచారం మేరకు 3–4 మంది ఉగ్రవాదులు భద్రతా దళాల ట్రాప్‌లో చిక్కుకున్నారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలు మోహరించగా, సెర్చ్ ఆపరేషన్, కాల్పులు కొనసాగుతున్నాయి. స్థానికులకు ఆ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
Compassionate Appointments : 2,569 మందికి కారుణ్య నియామకాలు – లోకేశ్
ఇక నిన్న రాత్రి కిష్త్వాడ్ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు గూఢచారి సమాచారం ఆధారంగా ఆపరేషన్ చేపట్టగా, ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో గంటల పాటు కాల్పులు సాగాయి. ఉగ్రవాదుల కదలికలను నియంత్రించేందుకు భద్రతా బలగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ పరిణామాలు కశ్మీర్‌లో ఉగ్రవాద సమస్య ఇంకా పూర్తిగా తగ్గలేదని, పాకిస్తాన్ మద్దతుతో సరిహద్దుల్లోకి చొరబడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సూచిస్తున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇటీవలి నెలల్లో కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు(Terrorist attacks) మళ్లీ పెరుగుతున్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంట సైనికులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ, కొంతమంది మిలిటెంట్లు లోనికి చొరబడటంతో పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, స్థానిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఉధంపూర్, కిష్త్వాడ్ సంఘటనలు చూపించినట్లుగా, ఉగ్రవాదులు ఇంకా చురుకుగా ఉన్నారనే వాస్తవాన్ని భద్రతా బలగాలు మరింత కఠిన చర్యలతో ఎదుర్కోవాల్సి ఉన్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
