Terrorists Encounter: కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్.. ? పాక్ మరో ప్లాన్!

సింగ్‌పొరా(Terrorists Encounter) పరిసర ప్రాంతాల్లో దాదాపు నలుగురు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు భావిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Terrorists Encounter Jammu Kashmir Kishtwar Singhpora

Terrorists Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. తాజాగా కిష్త్వార్ జిల్లాలోని సింగ్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు తిరుగుతున్నారనే సమాచారం భద్రతా బలగాలకు అందింది. దీంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదులను వెతకడం మొదలుపెట్టాయి. ఈక్రమంలో ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులను మొదలుపెట్టాయి. సింగ్‌పొరా(Terrorists Encounter) పరిసర ప్రాంతాల్లో దాదాపు నలుగురు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు భావిస్తున్నారు. వారి ఏరివేత కోసం ఇప్పుడు ఆపరేషన్ కొనసాగుతోంది.

Also Read :Samantha : సమంత స్పీచ్.. అక్కినేని అమల చప్పట్లు.. వీడియో వైరల్

భారత్‌ను కవ్వించేందుకు పాక్ మరో ప్లాన్ 

పాకిస్తాన్ మళ్లీ భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో త్వరలో మరో కీలక ప్రకటన చేయబోతోంది. మే నెల రెండోవారంలో భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతలు తీవ్రరూపు దాల్చడంతో.. అప్పట్లో తమ దేశ గగనతలాన్ని భారత్ కోసం పాకిస్తాన్ మూసేసింది.  తమ గగనతలం నుంచి భారతదేశ విమానాలను వెళ్లనిచ్చేది లేదని ప్రకటించింది.  ఈ నిర్ణయాన్ని మరో నెల రోజులు పొడిగించాలని పాకిస్తాన్ భావిస్తోందట. దీనివల్ల భారత్‌కు ఆర్థికంగా నష్టం చేయాలని పాక్ కుట్ర పన్నుతోందట. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో పాక్‌ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుందని తెలుస్తోంది.

రెండు రోజుల్లో పాక్ కీలక ప్రకటన

అంతర్జాతీయ వైమానిక సంస్థ(ICAO) రూల్స్ ప్రకారం.. ఒక దేశం మరో దేశానికి విధించే గగనతల ఆంక్షలు ఒకేసారి నెల రోజులకు మించి ఉండకూడదు. పాకిస్తాన్ గతంలో విధించిన ఈ నిషేధం మే 23 వరకే అమల్లో ఉంటుంది. ఆలోపు ఈ నిషేధాన్ని మరో నెలరోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవాలని పాక్ భావిస్తోందట. ఈ చర్యను అంతర్జాతీయ వైమానిక సంస్థ వద్ద భారత ప్రభుత్వం సవాల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ భారత్‌తో సఖ్యతను కోరుకుంటే.. ఇలాంటి చర్యలను పాక్ ఆపాల్సి ఉంటుంది.

Also Read :Land Registration Charges : తెలంగాణ లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగబోతున్నాయా..?

  Last Updated: 22 May 2025, 09:06 AM IST