Site icon HashtagU Telugu

PM Modi : ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు: ప్రధాని మోడీ

Terrorism is the biggest threat to humanity: PM Modi

Terrorism is the biggest threat to humanity: PM Modi

PM Modi : భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. అనంతరం వీరిద్దరూ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనను మోడీ ప్రస్తావించారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని ప్రధాని మోడీ అన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం అని మోడీ పునరుద్ఘాటించారు. పహల్గాం దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికింది. అందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ప్రధాని మోడీ అన్నారు.

Read Also: India Vs Pakistan : ‘అబ్దాలి’ని పరీక్షించిన పాక్.. సముద్ర జలాల్లో భారత్ ‘త్రిశూల శక్తి’

ఉగ్రవాదాన్ని అంతిమంగా నిర్మూలించేందుకు దేశాలు పరస్పరం మద్దతు ఇవ్వాలి అని పిలుపునిచ్చారు. ఇటీవల జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాంలో చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనను తీవ్రంగా ఖండించిన మోడీ, అతి త్వరలో నిందితులు శిక్షింపబడతారని నమ్మకం వ్యక్తం చేశారు. భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టి పోరాటం చేస్తోంది. ఇది మానవతా విలువలపై యుద్ధం. శాంతిని, అభివృద్ధిని కోరే ప్రతి దేశం ఈ పోరాటంలో భాగస్వామిగా మారాలి అని అన్నారు. భారత-అంగోలా సంబంధాలపై కూడా ప్రధాని చర్చించారు. వ్యాపారం, విద్యుత్‌, ఆరోగ్య, మైనింగ్‌, డిజిటల్ రంగాలలో సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు.

అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సో మాట్లాడుతూ.. భారత్‌ తో తమ దేశానికి ఉన్న బంధం చరిత్రాత్మకమైందన్నారు. ఉగ్రవాదంపై ప్రధాని మోడీ తీసుకుంటున్న కఠిన వైఖరికి మద్దతు ప్రకటించారు. “మానవాళిని కాపాడుకోవాలంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే. భారత్ ఈ విషయంలో నాయకత్వాన్ని వహిస్తోంది” అని ప్రశంసించారు. ఈ భేటీలో భారత-అంగోలా ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు జరగగా, ఉభయ దేశాలు పలు రంగాల్లో కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఇక, మోడీ మాట్లాడుతూ.. “భారతదేశం శాంతియుత ప్రపంచ నిర్మాణానికి కట్టుబడి ఉంది. కానీ శాంతికి అంతరాయం కలిగించే శక్తుల్ని ఖండించడానికి ఏ మాత్రం వెనకాడదు” అని స్పష్టం చేశారు.

Read Also: India : పాకిస్థాన్‌ నుండి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై తక్షణమే నిషేధం: భారత్‌