Site icon HashtagU Telugu

Chidambaram: కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పులు భారీగా పెరిగాయి: చిదంబరం

Chidambaram

Chidambaram

Chidambaram: తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పు భారీగా పెరిగిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు.  తెలంగాణ అప్పు రూ.3.66 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. సగటున రూ. రూ.కోటి అప్పు ఉన్నట్లు వెల్లడైంది. అయితే తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువగా ఉన్నాయని విమర్శించారు. నిరుద్యోగం, అధిక ధరలను నియంత్రించడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని వారు ఆక్షేపించారు.

ఇతర రాష్ట్రాల కంటే హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ పట్టణ నిరుద్యోగం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పటికీ భర్తీ చేయలేదన్నారు. హామీ ఇచ్చి నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడంతో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. నాడు ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామన్నారు.

తాము అధికారంలోకి వస్తే ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పారు. ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని నవంబర్ 30న ఓటింగ్ రూపంలో చూపించాలని చిదంబరం విజ్ఞప్తి చేశారు.