Site icon HashtagU Telugu

T Congress : ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ధర్నా

Congress Party

Congress Party

T Congress: తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో త్రీవ అన్యాయం జరిగిందని ఢీల్లీ(Delhi) వేదికగా కాంగ్రెస్‌ ఎంపీలు(Congress MPs) ధర్నా(Dharna) చేపట్టారు. తెలంగాణ కు బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రధాని, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రికి లేఖలు రాస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులను మేము వ్యతిరేకించడం లేదన్నారు. కానీ తెలంగాణకు కేటాయింపులు జరపమని కోరుతున్నామన్నారు. రాష్ట్రప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్, బీజెపీతో రాజీపడిందన్నారు. బడ్జెట్ పై చర్చ సంధర్భంగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లేవనెత్తుతామన్నారు. తెలంగాణకు న్యాయం జరిగేంతవరకు పార్లమెంట్‌లో పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలోని పాత జిల్లాల్లో 9 జిల్లాలకు వెనుకబడిన ప్రాంత నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీ గురించి ఎటువంటి ప్రస్తావన లేదన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే అమలు చేసేలా బడ్జెట్ లో హామీలు, కేటాయింపులు ఉన్నాయని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

భువనగరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బీజేపీ ఎంపీలు వమ్ము చేశారని తెలిపారు. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు. 2014 నుంచి విభజన చట్టం లోని పలు అంశాలపై ఏనాడు లేని కేటాయింపులు ఈసారి బడ్జెట్ లోనే ఎందుకు చేశారు..!? అని ప్రశ్నించారు. ప్రధాని తన కుర్చీ కాపాడుకునేందుకే బడ్జెట్ లో నితీశ్, చంద్రబాబు రాష్ట్రాలకు న్యాయం చేశారు. లోకసభ ఎన్నికల్లో బిజెపికి సహకరించిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎమ్.పిలు తెలంగాణకు జరిగిన అన్యాయం పై పోరాటం చెయ్యాలని తెలిపారు. ఈ ధర్నాలో నాగర్‌ కర్నూల్‌ ఎంపీ డా.మల్లు రవి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ పాల్గొన్నారు.

Read Also: TG Assembly : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అప్పులు ఎంతంటే..!!