CM Revanth Reddy : కాంగ్రెస్ జాతీయ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా రేవంత్ ను వాడుకోవాలని కాంగ్రెస్ ఫిక్స్ అయ్యింది

  • Written By:
  • Publish Date - April 17, 2024 / 08:47 PM IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy)..ఈ పేరు దేశం మొత్తం మారుమోగిపోతుంది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు (Congress Leaders) రేవంత్ రెడ్డి పేరును జపం చేస్తున్నారు. కేవలం ఆరు నెలల్లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తన సత్తా చాటుకున్నాడు. రాజకీయాల్లో అనుభవం మాత్రమే కాదు ఎవర్ని ఎక్కడ తగ్గించాలో..ఎక్కడ నిలబెట్టాలో..ఎలాంటి మాటలతో ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టించాలో..ప్రజలకు ఎలాంటి హామీలు ఏ సందర్భంలో ప్రకటించాలి..రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తు ఎలా వెయ్యాలో బాగా తెలిసినవాడు రేవంత్ రెడ్డి. అందుకే ఈరోజు తెలంగాణ సీఎం గా ఎన్నుకోబడ్డాడు. కేసీఆర్ (KCR) లాంటి రాజకీయ మేధావిని ఈరోజు ఒంటరి వాడ్ని చేసాడంటే అది కేవలం రేవంత్ రెడ్డి వల్లే సాధ్యమైంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ విజయాన్ని రిపీట్ చేయాలనీ చూస్తున్నాడు. అందుకే బిఆర్ఎస్ నేతలను వరుస పెట్టి తమ పార్టీలోకి చేరుకోవడం లో సక్సెస్ అయ్యాడు. ఓ పక్క పాలన కొనసాగిస్తూనే..మరోపక్క ప్రతిపక్ష పార్టీలపై మాటల తూటాలను వదులుతూ..ఇంకోపక్క కీలక నేతలను చేర్చుకుంటూ అధిష్టానం చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు తెలంగాణ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా రేవంత్ ను వాడుకోవాలని కాంగ్రెస్ ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల నగారా నడుస్తుంది. ఇప్పటికే పలు చోట్ల మొదటి విడత పోలింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈ క్రమంలో రేవంత్ చేత ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకునేందుకు షెడ్యూల్ ఖరారు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు కేరళలో ప్రచారం చేసేందుకు రేవంత్ వెళ్తున్నారు. అక్కడి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారం చేయనున్నారు. ఈ నెల 19 న మహబూబ్ నగర్, మహబూబాద్ ​లో జరిగే బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అలాగే ఏపీలో కూడా మరోసారి కాంగ్రెస్ తరుపున రేవంత్ ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద రేవంత్ ఇమేజ్ ను కాంగ్రెస్ పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో వాడుకోవాలని చూస్తుంది.

Read Also : MP Bharath : ప్రజలు పేదలుగా ఉండాలని జగన్ కోరుకుంటున్నారు..!