KCR FIRE : బీహార్ వేదికగా కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్..!!

బీహార్ లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రం నిర్లక్ష్యం వల్లే కోవిడ్ సమయంలో కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మండిపడ్డారు.

  • Written By:
  • Updated On - August 31, 2022 / 05:37 PM IST

బీహార్ లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రం నిర్లక్ష్యం వల్లే కోవిడ్ సమయంలో కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మండిపడ్డారు. వారు స్వస్థలాలకు వెళ్లేందుకు కనీసం రవాణా సౌకర్యం కూడా కల్పించకుండా నానా గోసపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలను, కార్మికులను తెలంగాణ సర్కార్ 150 రైళ్లలో వారి స్వస్థలాలకు ఫ్రీగా పంపించామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బీహార్ లోని పట్నాలో గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు బీహార్ సైనికుల కుటుంబాలకు పది లక్షలు, సికింద్రాబాద్ టింబర్ డీపోలో దుర్మరణం చెందిన 12మంది వలస కార్మికుల కుటంబాలకు ఐదు లక్షల చొప్పున బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో కలిసి కేసీఆర్ చెక్కులు పంపిణీ చేశారు.

తెలంగాణ డెవలప్ మెంట్ లోనూ బీహార్ కార్మికుల భాగస్వామ్యం మరువలేనిదన్నారు కేసీఆర్. తెలంగాణ వికాసం కోసం పాటుపడే బీహార్ కార్మికులకు తాము రుణపడి ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. వలస కార్మికుల కష్టసుఖాల్లో తెలంగాణ సర్కార్ పాలుపంచుకుంటుందని వెల్లడించారు. దేశాన్ని, దేశ ప్రజలను కాపాడేందుకు సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతుంటే…వారి కుటుంబాలకు ప్రతి భారతీయుడు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు కేసీఆర్. అమరవీరుల కుటంబాలకు ఆర్థిక సాయం చేయడం మన ధర్మం అన్నారు. దేశం కోసం అసువులుబాసిన జవాన్ల కోసం అడ్డంగా మేమున్నామంటూ స్ఫస్టం చేశారు. అమరవీరుల త్యాగం వెలకట్టలేదన్నారు.

అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ సహకారం అభినందనీయమన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ అన్నివేళలా పాటుపడుతన్నారన్నారు. మిషన్ భగీరథతో ప్రతిఇంటికి తానునీరందించడం అభినందనీయం అన్నారు. గాల్వాన్ బాధితుల కుటుంబాలకు తెలంగాణ, బీహార్ రెండూ రాష్ట్రాలు అండగా నిలుస్తాయన్నారు ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. తెలంగాణ ప్రభుత్వం వీరజవాన్ల కుటుంబాలకు కార్మికులకు ఆర్థికసాయం అందించడం సమాఖ్య సూర్తికి నిదర్శనమన్నారు.