Site icon HashtagU Telugu

Tehreek E Hurriyat : నాలుగు రోజుల్లోనే మరో కశ్మీరీ సంస్థపై బ్యాన్

Tehreek E Hurriyat

Tehreek E Hurriyat

Tehreek E Hurriyat : కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌‌లో మరో సంస్థపై బ్యాన్ విధించింది. తాజాగా తెహ్రీక్-ఎ-హురియత్‌ సంస్థను నిషేధించింది. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (UAPA) చట్టం ప్రకారం ఈ చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వెల్లడించారు. ‘‘హురియత్‌ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడదీసి రాష్ట్రంలో ఇస్లామిక్ పాలనను నెలకొల్పాలని చూస్తోంది. భారత్‌పై దుష్ప్రచారం చేసేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు తెహ్రీక్-ఏ-హురియత్(Tehreek E Hurriyat) ఏర్పడింది’’ అని ఆయన తెలిపారు. UAPA చట్టం కింద జమ్మూ కశ్మీర్‌లో తెహ్రీక్-ఎ-హురియత్‌ను చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

హురియత్ టైమ్ లైన్

  • హురియత్ కాన్ఫరెన్స్ 1993 సంవత్సరంలో ఏర్పడింది.
  • హురియత్ కాన్ఫరెన్స్ సంస్థ అనేది జమ్మూ కశ్మీర్‌లోని 26 సంస్థల సమూహం.
  • హురియత్ కాన్ఫరెన్స్‌లో పాకిస్తాన్ అనుకూల, వేర్పాటువాద సంస్థలు ఉన్నాయి. వీటిలో  జేకేఎల్‌ఎఫ్‌, దుఖ్తరన్-ఎ-మిల్లత్ వంటి పలు సంస్థలు ఉన్నాయి.
  • జమ్మూ కశ్మీర్‌ వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీ షా గిలానీ 2004లో తెహ్రీక్‌ ఏ హురియత్‌ సంస్థను స్థాపించారు.
  • గిలానీ తర్వాత తెహ్రీక్-ఎ-హురియత్ చైర్మన్‌గా ముహమ్మద్ అష్రాఫ్ సెహ్రాయ్ పని చేశారు.
  • 2005లో హురియత్ కాన్ఫరెన్స్ రెండు వర్గాలుగా విడిపోయింది.

Also Read: TikTok Tragedy : టిక్‌టాక్ వీడియోపై గొడవ.. సోదరిని చంపేసిన 14 ఏళ్ల బాలిక 

నాలుగు రోజుల క్రితమే ముస్లిం లీగ్‌ జమ్ము కశ్మీర్‌ (మసరత్‌ ఆలం గ్రూప్‌)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా ఉగ్రవాదానికి సహకారం అందిస్తోందనే ఆరోపణలతో ఆ సంస్థపై వేటు వేసింది. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం ముస్లింలీగ్‌ జమ్ముకశ్మీర్‌ (మసరత్‌ ఆలం వర్గం)పై నిషేధం విధిస్తున్నాం. ఈ సంస్థ సభ్యులు జమ్ముకశ్మీర్‌లో దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఇస్లామిక్‌ రాజ్యం ఏర్పాటుచేసేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు’ అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.