Site icon HashtagU Telugu

Israel Army – Agniveer : ‘అగ్నివీర్’ స్కీంతో భారత్‌కు ఇజ్రాయెల్ తరహా ముప్పు : సామ్నా

Israel Army Agniveer

Israel Army Agniveer

Israel Army – Agniveer : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ స్కీంను విమర్శిస్తూ శివసేన పార్టీ పత్రిక సామ్నాలో సోమవారం ప్రత్యేక సంపాదకీయం ప్రచురితమైంది. ఇందులో ఇజ్రాయెల్ సైనిక వ్యవస్థ నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వ ‘అగ్నివీర్’ పథకాన్ని శివసేన దుయ్యబట్టింది. ‘‘ఇజ్రాయెల్ పౌరులంతా సైన్యంలో కొంత కాలం పాటు సేవలందించాలనే రూల్ ఉంది. అదే తరహాలో కాంట్రాక్ట్‌  ప్రాతిపదికన సైనికులను రిక్రూట్ చేసుకునేందుకు మోడీ సర్కారు  ‘అగ్నివీర్’ పథకాన్ని తీసుకొచ్చింది’’ అని సంపాదకీయంలో ప్రస్తావించారు.‘‘ఇజ్రాయెల్ ఆర్మీలోని కాంట్రాక్టు వ్యవస్థ వల్లే ఆ దేశ బార్డర్ లో భద్రత కొరవడింది. దీన్ని ఆసరాగా చేసుకొని హమాస్ సులభంగా చొరబడి.. ఇజ్రాయెల్ లోని సరిహద్దు గ్రామాలపై దాడులు చేయగలిగింది. అగ్నివీర్ వ్యవస్థ వల్ల కూడా దేశానికి అలాంటి ముప్పు ముసురుకునే అవకాశం ఉంటుంది’’ అని సామ్నా ఎడిటోరియల్ లో హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘ఇజ్రాయెల్ యొక్క మూడున్నర లక్షల సైన్యం గాజా బార్డర్ లో నిలబడి ఉంది. కానీ గ్రౌండ్ ఎటాక్ చేసేంత తెగువ దానికి లేదు. దీనికి ప్రధాన కారణం.. ఆ సైన్యంలోని వాళ్లంతా కాంట్రాక్టు సైనికులే’’ అని సామ్నా పత్రిక విశ్లేషించింది. ‘‘సొంతంగా ఆర్మీ కూడా లేని గాజాపై 15 రోజులుగా యుద్ధం చేస్తుండటం ఇజ్రాయెల్ లాంటి మెగా సైన్యం కలిగిన దేశానికి పెద్ద ఓటమి. ఇజ్రాయెల్ ఆర్మీని కాంట్రాక్టు వ్యవస్థ బలహీనం చేసింది అనేందుకు ఇదే నిదర్శనం. భూమిపై నుంచి నేరుగా దాడి చేసే సామర్థ్యం ఇజ్రాయెల్ ఆర్మీకి లేదు’’ అని ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Musk Vs Wikipedia : 8300 కోట్లిస్తా.. ‘వికీపీడియా’ పేరును ‘డికీపీడియా’గా మార్చేయండి : మస్క్

“ఇజ్రాయెల్ పౌరులు సైనిక విద్య, సైనిక సేవ చేయడం తప్పనిసరి. అక్కడి స్త్రీలు 22 నెలలు సైన్యంలో పనిచేయాలి. పురుషులు సాధారణంగా ఐదు సంవత్సరాలు సైన్యంలో సేవ చేయాలి. అందుకే ఆ  సైన్యం గాలివాన లాంటిది. సైన్యం బయటికొచ్చాక వాళ్లంతా ఇతర ఉద్యోగాలు వెతుక్కోవాలి  అదే తరహాలో కాంట్రాక్ట్‌పై సైనికులను నియమించుకునే ‘అగ్నివీర్’ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. అగ్నివీర్లను ఆ తర్వాత నిరుద్యోగులుగా మార్చాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. వాళ్లంతా ఆర్మీ నుంచి బయటికి వచ్చాక రోడ్డుపై పకోడాలు వేసుకోవాలా?’’ అని సామ్నా పత్రిక తన సంపాదకీయంలో విరుచుకుపడింది.