NIA Team : పశ్చిమబెంగాల్‌ కలకలం..NIA బృందంపై దాడి

  • Written By:
  • Publish Date - April 6, 2024 / 12:19 PM IST

NIA Team Attacked In West Bengal : పశ్చిమబెంగాల్‌ (West Bengal)లో జాతీయ దర్యాప్తు సంస్థ( (National Investigation Agency) (NIA) వాహనంపై దాడి జరిగింది. 2022 బాంబు పేలుడు కేసులో దర్యాప్తు కోసం వెళ్లిన ఎన్​ఐఏ అధికారుల వాహనాన్ని ఓ గుంపు చట్టుముట్టి రాళ్లు రువ్వారు. దీంతో వాహనం ధ్వంసమైంది. పేలుడు కేసుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోల్​కతాకు తిరిగి వెళుతుండగా పుర్బా మేదినీపుర్ (Medinipur జిల్లాలోని భూపతినగర్(Bhupatinagar)​ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తమ అధికారి ఒకరు గాయపడ్డారని ఎన్​ఐఏ తెలిపినట్లు ఓ సీనియర్​ పోలీసు ఆఫీసర్​ చెప్పారు. దీనిపై ఎన్​ఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు.

ఎన్ఐఏ అధికారుల వాహనంపై దాడి చేసిన గుంపు నిందితులను తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. అరెస్టు చేసిన నిందితులతో, ఎన్​ఐఏ అధికారులు ఉన్న భూపతినగర్​కు భారీగా కేంద్ర బలగాలు చేరుకుంటున్నాయి. 2022 డిసెంబర్ 3న భూపతినగర్​లో జరిగిన పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును ఎన్​ఐఏకు అప్పగించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, జనవరిలో ఈ తరహా ఘటన బంగాల్​లో జరిగింది. రేషన్ పంపిణీ స్కామ్​ కేసులో ఉత్తర 24 పరగణాలు జిల్లా సందేశ్​ఖాలీలోని టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులపై అతడి అనుచరులు దాడి చేశారు. పెద్ద సంఖ్యలో గుమిగూడిన టీఎంసీ మద్దతుదారులు- ఈడీ అధికారులతో పాటు వారి వెంట వచ్చిన కేంద్ర బలగాలను చుట్టుముట్టారు. అనంతరం వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఈడీ అధికారుల వాహనాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీకి చెందిన ఇద్దరు అధికారులు గాయపడ్డారు.

Read Also:YS Sunitha Reddy : షర్మిలను జగన్ అందుకే పక్కన పెట్టారు : వైఎస్ సునీత 

రేషన్ పంపిణీ స్కామ్ కేసులో ఇదివరకే అరెస్టయిన రాష్ట్ర మంత్రి జ్యోతిప్రియో మల్లిక్​కు షేక్​ షాజహాన్​ అత్యంత సన్నిహితుడు అని అధికారులు తెలిపారు. ‘ఎనిమిది మంది దుండగులు ఘటనాస్థలికి వచ్చారు. మా బృందంలోని ముగ్గురు సభ్యులం అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాము. ఈ క్రమంలో వారు మాపై దాడికి దిగారు’ అని దాడి సమయంలో ఈడీ బృందంలో ఉన్న సభ్యుడు తెలిపారు.