Income Tax: రూ.10 లక్షల ఆదాయం ఉన్న.. ఒక్క రూపాయి కట్టాల్సిన పనిలేదు.. ఎలా అంటే?

సాధారణంగా ఏడాదికి రూ.5.5 లక్షలకు మించి ఉంటే తప్పకుండా పన్ను చెల్లించాలి అన్న విషయం తెలిసిందే. కానీ

  • Written By:
  • Publish Date - July 17, 2022 / 09:45 AM IST

సాధారణంగా ఏడాదికి రూ.5.5 లక్షలకు మించి ఉంటే తప్పకుండా పన్ను చెల్లించాలి అన్న విషయం తెలిసిందే. కానీ రూ.2.5 లక్షల వరకు అసలు పన్ను ఉండదు. 2.5 లక్షల కంటె అంతకు మించి 5 శాతం పన్ను రూ.12,500 చెల్లించాలి. కానీ, సెక్షన్ 87ఏ కింద దీనికి రిబేట్ ఉంటుంది. దీనికి తోడు స్టాండర్డ్ డిడక్షన్ కింద అందరికీ రూ.50వేల మినహాయింపు ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ, వారి ఆదాయం సంవత్సరానికి రూ.5.5 లక్షలకు మించి లేకపోతే పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు ఏర్పడదు కూడా. కానీ ఏడాదికి రూ.5.5 లక్షలకు పైన ఆదాయం కలిగిన వారు ప్రస్తుత రోజుల్లో గణనీయ సంఖ్యలో ఉన్నారు.

అయితే వీరందరూ కూడా తప్పకుండా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొత్త పన్ను విధానం కాకుండా, పాత పన్ను విధానంలోనే కొనసాగితే ఎన్నో పన్ను ఆదా మార్గాలు చట్ట పరంగా ఉన్నాయి. అలా పాత పన్ను విధానాలను కొనసాగించడం వల్ల రూ.10.25 లక్షలు ఉన్నప్పటికీ రూపాయి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. కాగా ప్రస్తుతం పాత పన్ను విధానం కింద రూ.5-10 లక్షల మధ్య ఆదాయం వుంటే 20 శాతం, రూ.10-12.5 లక్షల మధ్య ఉంటే 30 శాతం, రూ.12.5 లక్షలకు పైన వుంటే కనుక 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకుంటే మాత్రం చాలా వరకు పన్ను మినహాయింపులను కోల్పోవాల్సి వస్తుందట. కొత్త పన్ను విధానంలో రూ.2.5-5 లక్షల ఆదాయంపై 5 శాతం, రూ.5-7.5 లక్షల ఆదాయంపై 10 శాతం, రూ.7.5 10 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.10 12.5 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.12.5 15 లక్షల ఆదాయంపై 25 శాతం, ఆపైన ఉంటే 30 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా కొత్త పన్ను విధానంలో రేటు అమలు అవుతుంది. అయితే పాత పన్ను విధానంలో ఉంటే సెక్షన్ 80సీ కింద వివిధ సాధనాల్లో ఏడాదికి రూ.1.5 లక్షలు ఆదా చేసుకోవాలి. దీంతో ఈ మొత్తం కలిపి రూ.7 లక్షల ఆదాయం పై పన్ను పడదు. గృహ రుణం తీసుకుని దానికి చెల్లించే వడ్డీని రూ.2 లక్షలు పన్ను మినహాయింపు కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతో 9 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకుండా పోతుంది. గృహ రుణం అసలుకు చేసే చెల్లింపులను సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పరిమితి కింద చూపించుకోవచ్చు.