Tax Relief: కేంద్ర ఉద్యోగులకు శాలరీ ఏరియర్స్ పై నో ట్యాక్స్.. ఇందుకోసం ఏం చేయాలంటే ?!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ !! వారి జీతాల్లో బకాయిలు ఉంటే.. వాటికి పన్ను కట్టాల్సిన పని లేదు.

  • Written By:
  • Publish Date - August 26, 2022 / 08:00 AM IST

కట్టాల్సిన అవసరం లేదు.. ఎలాగంటే?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ !! వారి జీతాల్లో బకాయిలు ఉంటే.. వాటికి పన్ను కట్టాల్సిన పని లేదు. పన్ను నుంచి మినహాయింపును పొందొచ్చు. 7వ వేతన సంఘం సిఫారసు ప్రకారం.. ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపును పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్యాక్స్ రూల్స్ ప్రకారం.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఫామ్ 10ఈని ఆన్ లైన్ లో ఫైల్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 80 ప్రకారం రిలీఫ్ ను క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్ కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ వెబ్ సైట్ లో ఫైల్ చేయాలి. ఒకవేళ ఫామ్ 10ఈని నింపకుండా సెక్షన్ 89 ప్రకారం రిలీఫ్ క్లెయిమ్ చేస్తే ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ నుంచి నోటీసులు వస్తాయి. 10ఈ ఫామ్ ను ఫైల్ చేస్తేనే సెక్షన్ 89 కింద రిలీఫ్ ను పరిగణిస్తామని ఇన్ కమ్ టాక్స్ నోటీసులు పంపిస్తుంది.

ఫామ్ 10ఈ ఎలా ఫైల్ చేయాలి?

* ఈ స్టెప్స్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఫామ్ 10ఈని ఫైల్ చేయొచ్చు.

* దాని కోసం http://www.incometax.gov.in కు లాగిన్ అవ్వాలి.

* e-File అనే ఆప్షన్ లోకి వెళ్లి Income Tax Forms అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
* File Income Tax Forms అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

* tax Exemption and Reliefs/Form 10E అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

* ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్, అలవెన్సులను పే చేస్తుంటారు.

* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఐటీఆర్ ఫైల్ చేయడం కంపల్సరీ.

డీఏ పెంపు ఎంత ఉండొచ్చు ?

ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) జూన్ నెలలో 129.2 పాయింట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏఐసీపీఐ రిపోర్ట్స్‌ను గమనిస్తే.. ప్రతీ నెలా ఇండెక్స్ పెరుగుతూనే ఉంది. ఇదే ట్రెండ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఉద్యోగులకు ఎంత లేదన్నా 4 శాతం డీఏ పెంపుకి 7వ వేతన సంఘం కేంద్రానికి సిఫారసు చేయవచ్చు. కేంద్రం ఆ మేరకు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరుతుంది.

డీఏ పెంపుపై ప్రకటన ఎప్పుడు ?

కేంద్ర కేబినెట్ త్వరలోనే సమావేశమై డీఏ పెంపుపై  నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బహుశా సెప్టెంబర్ చివరి వారానికల్లా దీనిపై కేంద్రం ప్రకటన చేయవచ్చు. పెరిగిన డీఏని సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

డీఏ ఏరియర్స్ సంగతేంటి ?

కొవిడ్ కాలంలో 18 నెలల డీఏ చెల్లింపులు కేంద్రం బకాయిపడింది. జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు చెల్లింపులు నిలిపివేసింది. డీఏ ఏరియర్స్ ఎప్పుడిస్తారనే దానిపై ఇప్పటికైతే ఎటువంటి ప్రకటన రాలేదు. డీఏ బకాయిలను వడ్డీతో సహా చెల్లించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. జేసీఎం సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా సుప్రీం తీర్పును ప్రస్తావిస్తూ ఇదే విషయాన్ని పేర్కొన్నారు. బకాయిపడ్డ డీఏకి కేంద్రం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీనిపై ఉద్యోగులు కేంద్రంతో చర్చించేందుకు సిద్దంగా ఉన్నారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ చర్చలు ముందుకెళ్లవచ్చు.