ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి పర్యటన ముగిసిన తరువాత యూపీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎస్పీ,బీజేపీ మధ్య మాటల యుద్ధం పెరిగింది.ఇదే సమయంలో ఆదాయపు పన్నులశాఖ అధికారులు రంగంలోకి దిగారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అనుచరుల ఇళ్లలో సోదాలు మొదలు పెట్టారు.వారణాసి నుండి I-T విభాగానికి చెందిన బృందం శనివారం ఉదయం తూర్పు UPలోని మౌ జిల్లాకు చేరుకుంది. అక్కడి సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రాయ్ ఇంటిపై దాడి చేసింది. ఆయన రాయ్ గ్రూపు పేరుతో కర్నాటక రాష్ట్రంలో విద్యాసంస్థలను నడుపుతున్నాడు. అఖిలేష్ వ్యక్తిగత కార్యదర్శి జైనేంద్ర యాదవ్, మరో నేత మనోజ్ యాదవ్‌పై ఆదాయపు పన్నులశాఖ టీం సోదాలను నిర్వహిస్తోంది.
"अभी तो इनकम टैक्स आया है"
राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी प्रेसवार्ता, रायबरेली pic.twitter.com/aZNsX5FS3m
— Samajwadi Party (@samajwadiparty) December 18, 2021
ఈ సోదాలపై అఖిలేష్ యాదవ్ సీరియస్ గా స్పందించాడు. ఎన్నికల సమీపిస్తోన్న తరుణంలో ఇలాంటి దాడులను ఊహించానని ఆరోపించాడు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వస్తుంది, సీబీఐ వస్తుందిని భావిస్తున్నాడు. రాజకీయ ప్రత్యర్థులను “భయపెట్టడానికి” కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకునే బిజెపి ఓటమిని ముందుగానే అంగీకరిస్తోందని అఖిలేష్ అన్నాడు. ఈ ధోరణిని గతంలో కాంగ్రెస్ అవలంభించి ప్రస్తుతం ప్రజలకు దూరమైన విషయాన్ని గుర్తు చేశాడు.
