Tamannaah Bhatia : కొత్త పార్లమెంట్ భవనంలో నటి తమన్నా సందడి

గురువారం మధ్యాహ్నం భవనాన్ని సందర్శించిన తమన్నా, మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill)పై స్పదించింది. సామాన్యులు రాజకీయాల్లోకి రావడానికి ఇది దోహదపడుతుందని చెప్పుకొచ్చింది.

  • Written By:
  • Publish Date - September 21, 2023 / 03:40 PM IST

 

కొత్త పార్లమెంట్ భవనంలో నటి తమన్నా (Tamannaah Bhatia) సందడి చేసింది. 96 ఏళ్ల నాటి పాత పార్లమెంట్ భవనాన్ని పక్కకు పెట్టి కేంద్ర సర్కార్. అత్యాధునిక హంగులతో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది. ఈ భవనానికి “పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా” (Parliament House Of India)గా నామకరణం చేసారు. మంగళవారం నుండి ఈ కొత్త పార్లమెంటు భవనం లోనే సమావేశాలు జరుగుతున్నాయి. కాగా ఈ పార్లమెంట్ భవనాన్ని సినీ నటి తమన్నా సందర్శించింది.

గురువారం మధ్యాహ్నం భవనాన్ని సందర్శించిన తమన్నా, మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill)పై స్పదించింది. సామాన్యులు రాజకీయాల్లోకి రావడానికి ఇది దోహదపడుతుందని చెప్పుకొచ్చింది. అలాగే నటి దివ్యా దత్త , మంచు లక్ష్మి, ఖుష్బూ‌లు కూడా పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చొరవ అద్భుతమని , ప్రతి అంశంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు బాగుందన్నారు. ఇక పార్లమెంట్ భవనాన్ని సందర్శించేందుకు సినీ తారలు పోటీపడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్ కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. క్రికెటర్ మిథాలి రాజ్, బాక్సర్ మేరీకోమ్, హాకీ క్రీడాకారిణి రాణి రామ్‌పాల్, పారాఒలింపిక్ అథ్లెట్ దీపా మెహతా సందర్శించిన వారిలో ఉన్నారు.

ఇక కొత్త పార్లమెంట్ భవనం (Parliament New Building)లో చాల ప్రత్యేకలు ఉన్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో ఎంపీల మైక్‌లన్నీ ‘ఆటోమేటెడ్‌ వ్యవస్థ’ సాయంతో పని చేస్తాయని సమాచారం. అంటే ఎవరైనా ఎంపీ మాట్లాడేందుకు స్పీకర్‌ సమయం కేటాయిస్తే.. ఆ నిర్దేశిత సమయం పూర్తి కాగానే మైక్రోఫోన్ స్విచ్‌ ఆఫ్‌ అవుతుంది. కొత్త పార్లమెంటులో బయోమెట్రిక్‌ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ఆటోమెటెడ్ సిస్టమ్‌ను తీసుకురావడానికి ఒక ప్రధాన కారణం ఉంది. తమ ప్రసంగాలు పూర్తి కాకముందే.. ప్రభుత్వాలు మైక్రోఫోన్‌లను ఆపేసి, తమ గొంతును నొక్కేస్తుందని ప్రతిపక్ష ఎంపీల నుంచి ఆరోపణలు వచ్చాయి. అందుకే దీనిని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.

Read Also : TDP- Janasena Alliance : జనసేనతో పొత్తు లోక కల్యాణం కోసమే – అయ్యన్న

అలాగే సమావేశాలు జరిగే సమయంలో కొందరు సభ్యులు తమ ఆవేశం కోల్పోయినప్పుడు వెల్‌లోకి దూసుకొచ్చి, నిరసనలు తెలుపుతుంటారు. అయితే.. కొత్త భవనంలో అందుకు వీలు లేకుండా బాగా కుదించేశారు. బయోమెట్రిక్ వ్యవస్థని సైతం ఏర్పాటు చేశారు. ఈ కొత్త భవనంలో ఇకపై పేపర్‌లెస్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అంటే.. ఇకపై పేపర్ల అవసరం లేకుండా ప్రతీ ఎంపీకి ఒక ప్రత్యేకమైన టాబ్లెట్ కంప్యూటర్‌ని ఇస్తారు. ఇక జర్నలిస్టుల కోసం కఠినమైన ప్రవేశ నిబంధనలూ ఉంటాయి. ఈ పార్లమెంట్‌లో మరో ఆకర్షణీయ విషయం ఏమిటంటే.. ఆరు ద్వారాలు. వీటికి గజ, అశ్వ, గరుడ, మకర, శార్దూల, హంస అనే పేర్లు కేటాయించారు.