Rana With Pak Army : 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవ్వుర్ రాణాతో తమకు లింకు లేదంటూ ఇటీవలే పాకిస్తాన్ విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. రాణా కెనడా జాతీయుడని వెల్లడించింది. అయితే ఇప్పుడు ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో రాణా కీలక వివరాలను వెల్లడించాడు. వాటిని వింటే పాక్ విదేశాంగ శాఖకు దిమ్మ తిరుగుతుంది. అంతలా రాణా ఏం చెప్పాడో చూద్దాం..
Also Read :LunaRecycle Challenge: చందమామపై మానవ వ్యర్థాలు.. ఐడియా ఇచ్చుకో.. 25 కోట్లు పుచ్చుకో
పాక్ ఆర్మీ యూనిఫాంలోనే అస్తమానం..
జాతీయ మీడియా కథనం ప్రకారం.. ‘‘మాది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న చిచావత్ని గ్రామం. మా నాన్న ఒక స్కూల్ ప్రిన్సిపాల్. మా ఇంట్లోని ముగ్గురు అన్నదమ్ములలో నేను ఒకడిని. నా సోదరులలో ఒకరు పాకిస్తాన్ సైన్యంలో మనోరోగ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మరొకరు జర్నలిస్ట్. పాకిస్తాన్‌లోని హసనబ్దల్‌లో ఉన్న ఆర్మీ క్యాడెట్ కాలేజీలో నేను చదువుతుండగా డేవిడ్ కోల్మన్ హెడ్లీ (దావూద్ సయ్యద్ గిలానీ)తో పరిచయం ఏర్పడింది. హెడ్లీ ఇప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్నాడు. నేను వైద్య విద్యను అభ్యసించాను. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వైద్య దళంలో కొంతకాలం పనిచేశాను. అయితే దాని నుంచి బయటికి వచ్చాక కూడా లష్కరే తైబా ఉగ్రవాదులు, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సంబంధీకులను కలిసేటప్పుడు ఆర్మీ యూనిఫాంనే ధరించేవాడిని. నేను ఆర్మీ యూనిఫాంలోనే పాక్ ఐఎస్ఐకు చెందిన మేజర్ ఇక్బాల్‌ను కూడా కలిశాను’’ అని తహవ్వుర్ రాణా వివరించాడు. దీన్నిబట్టి పాకిస్తాన్ ఆర్మీతో, గూఢచార సంస్థ ఐఎస్ఐతో రాణాకు(Rana With Pak Army) లింకులు ఉండేవని తేటతెల్లమైంది.
Also Read :Gangster Nayeem: గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల వ్యవహారం.. ఈడీ దూకుడు
ఉగ్రవాది సాజిద్ మీర్‌తోనూ లింకులు..
‘‘నేను పాక్ ఆర్మీ నుంచి బయటికి వచ్చాక.. 1997లో నా భార్య, ప్రాక్టీసింగ్ ఫిజీషియన్ సమ్రాజ్ రాణా అక్తర్‌తో కలిసి కెనడాకు వెళ్లాను. అక్కడ ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీని ప్రారంభించాను. ఆ తర్వాత హలాల్ మాంసం వ్యాపారం మొదలుపెట్టాను. నా కన్సల్టెన్సీ తరఫున డేవిడ్ హెడ్లీని కన్సల్టెంట్‌గా ముంబైకు పంపాను’’ అని రాణా చెప్పినట్లు సమాచారం. 2008 నవంబరు 26 నుంచి 29 వరకు ముంబై ఉగ్రదాడి జరిగింది. ఆ టైంలో ముంబైలోని చాబాద్ హౌస్ ముట్టడికి ప్లాన్ ఇచ్చింది ఉగ్రవాది సాజిద్ మీర్. ఇతడు పాకిస్తాన్‌లో ఉంటూ ఉగ్రవాదులతో ఫోనులో మాట్లాడుతూ ముంబైలోని చాబాద్ హౌస్ ముట్టడిని ఆపరేట్ చేయించాడు. సాజిద్ మీర్‌తోనూ తనకు మంచి సంబంధాలు ఉండేవని దర్యాప్తులో రాణా చెప్పాడట.