తడోబా నేషనల్ పార్క్ (Tadoba National Park )..ఈ పార్క్ అంటే జంతు ప్రేమికులకు ఎంతో ఇష్టం..ముఖ్యంగా ఈ పార్క్ లో ఆకర్షించే పులుల (Tigers)తో పాటు భారతీయ చిరుతలు, బద్దకపు ఎలుగుబంట్లు, గౌర్, నీల్‌గై, ధోలే, చారల హైనా, స్మాల్ ఇండియన్ సివెట్, అడవి పిల్లులు, సాంబార్, మచ్చల జింక, మొరిగే జింకలు, చితాల్, మార్ష్ మొసలి, ఇండియన్ పైథాన్, ఇండియన్ కోబ్రా, గ్రే హెడ్డ్ ఫిష్ ఈగిల్, క్రెస్టెడ్ సర్పెంట్ ఈగిల్, నెమలి, జ్యువెల్ బీటిల్స్, వోల్ఫ్ స్పైడర్స్ మొదలైనవి కనిపిస్తుంటాయి. అలాగే విపరీతంగా కనిపించే కొన్ని వృక్ష జాతులు, టేకు, ఐన్, బీజా, ధౌడ, హల్డ్, సలై, సెమాల్, టెండు, బెహెడ, హిర్దా, కారయా గమ్, మహువా మధుకా, అర్జున్, వెదురు, భేరియా, బ్లాక్ ప్లం అనేక రకాల చెట్లు దర్శనం ఇస్తుంటాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఇది ఎక్కడ ఉందని అనుకుంటున్నారా..? మహారాష్ట్ర (Maharashtra) లోని చంద్రపూర్ (Chandrapur) జిల్లాలో ఉంది. నాగ్‌పూర్ నగరానికి సుమారు 150 కి.మీ దూరంలో ఈ పార్క్ ఉంది. హైదరాబాద్ నుంచి 406 కిలోమీటర్ల దూరంలో ఈ పార్క్ ఉంది. ఇక్కడికి బస్సుతో పాటు రైలు మార్గం కూడా అందుబాటులో ఉంది. టైగర్ రిజర్వ్ యొక్క మొత్తం వైశాల్యం 1,727 చ.కి.మీ, ఇందులో తడోబా నేషనల్ పార్క్ 1955లో సృష్టించబడింది. అంధారి వన్యప్రాణుల అభయారణ్యం 1986 సంవత్సరంలో ఏర్పడింది. ఈ అడవిలో ఎక్కువ భాగం కొండ ప్రాంతంలో ఉంది. అందువల్ల అనేక కొండలు మరియు భూభాగాలు ఇక్కడ అడవి జంతువులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఇది దట్టమైన అటవీ ప్రాంతం కావడం.. మృదువైన పచ్చికభూములు, లోతైన లోయలు ఉండడంతో.. ఎక్కువ సంఖ్యలో పులులను నివాసం ఉంటున్నాయి. తడోబా నేషనల్ పార్క్ యొక్క ప్రధాన ఆకర్షణ జంగిల్ లేదా టైగర్ సఫారీ ఓపెన్ టాప్ జిప్సీ… అందుకే జంతు ప్రేమికులు ఇక్కడ తిరిగే పులులను చూడడానికి క్యూ కడుతుంటారు. రీసెంట్‌గా ఈ అంధారి టైగర్ రిజర్వ్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా సందర్శించారు. మీరు కూడా ఎప్పుడైనా సమయం దొరికితే ఈ పార్క్ ను చూసి ఎంజాయ్ చెయ్యండి.
Read Also : Congress Manifesto Committee: లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో సీఎం సిద్ధరామయ్య