AAP : స్వాతి మలివాల్‌పై దాడి కేసు..నేడు కేజ్రీవాల్‌ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలిసులు

  • Written By:
  • Updated On - May 23, 2024 / 12:10 PM IST

 

Kejriwal’s parents: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌(Bibhav Kumar) ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌(Swati Maliwal)పై దాడి చేశాడంటూ ఆరోపణ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్వాతి ఫిర్యాదుతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిభవ్‌ కుమార్‌ను కూడా అరెస్ట్‌ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే, ఈ కేసులో కేజ్రీవాల్‌ తల్లిదండ్రులను(Kejriwal’s parents) కూడా ఈరోజు ఢిల్లీ పోలీసులు ప్రశ్నించనున్నట్లు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ ఉదయం ఢిల్లీ పోలీసులు సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలోని సీఎం నివాసానికి చేరుకొని కేజ్రీ తల్లిదండ్రులను ప్రశ్నించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ కేసులో సీఎం తల్లిదండ్రులతోపాటు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌ నుంచి కూడా వాంగ్మూలం తీసుకోనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.

Read Also: Karimnagar – Anant Ambani : అనంత్ అంబానీ పెళ్లి.. గెస్టులకు గిఫ్టుగా కరీంనగర్ ఫిలిగ్రీ ప్రోడక్ట్స్

మరోవైపు స్వాతి మలివాల్‌(Swati Maliwal) మీద దాడి ఘటనపై ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(CM Arvind Kejriwal) బుధవారం తొలిసారి స్పందించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ అంశం విచారణ దశలో ఉన్నందున తాను స్పందిస్తే విచారణపై ప్రభావం పడుతుందని అన్నారు. అయితే, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని, న్యాయం చేయాలని మాత్రం తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రెండు రకాల వాదనలు ఉన్నందున పోలీసులు ఇరువైపుల వాదనలపై విచారణ జరిపి, న్యాయం చేయాలని పేర్కొన్నారు.