Swati Maliwal : అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి : స్వాతి మలివాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) బిభవ్ కుమార్‌ తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Updated On - May 26, 2024 / 03:18 PM IST

Swati Maliwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) బిభవ్ కుమార్‌ తనపై దాడికి పాల్పడ్డాడంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కంప్లయింట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ  ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం తనను బెదిరిస్తోందని స్వాతి మలివాల్ ఆదివారం ఆరోపించారు. ఆప్ నాయకులు తన క్యారెక్టర్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అత్యాచారం, హత్య బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆమె చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తనకు వ్యతిరేకంగా ఏకపక్ష వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్  చేస్తున్నారని స్వాతి మలివాల్ (Swati Maliwal) మండిపడ్డారు. తన అభిప్రాయాన్ని చెప్పాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. మెసేజ్‌లు పెట్టినా ధ్రువ్ రాఠీ స్పందించడం లేదన్నారు. ధ్రువ్ రాఠీ తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అసత్య ఆరోపణలు చేయడాన్ని ఆపాలని ధ్రువ్ రాఠీకి స్వాతి మలివాల్ హితవు పలికారు. ‘‘స్వతంత్ర జర్నలిస్టులమని చెప్పుకునే ధ్రువ్ రాఠీ లాంటి వాళ్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధుల్లా ప్రవర్తిస్తున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.  ‘‘యూట్యూబర్ ధృవ్ రాఠీని ఆప్ ప్రతినిధిలాగా వ్యవహరిస్తున్నాడు..  దాడి కేసులో బాధితురాలినైనా  నన్ను అవమానించాడు. రాఠీ  2.5 నిమిషాల యూట్యూబ్ వీడియోలో అన్నీ అబద్ధాలే ఉన్నాయి’’ అని స్వాతి మలివాల్ తెలిపారు. ‘‘నాకు వస్తున్న బెదిరింపుల సమాచారాన్ని ఢిల్లీ పోలీసులకు అందించాను. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ ఆమె చెప్పారు.

Also Read : IT Raids : నగల దుకాణంపై ఐటీ రైడ్స్.. రూ.116 కోట్ల విలువైన ఆస్తులు సీజ్​