Site icon HashtagU Telugu

Delhi Politics: వెంకయ్యనాయుడి ఇంట్లో సస్పెండైన ఎంపీలు

suspended MPs

suspended MPs

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనమరాలి రిసెప్షన్ ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి నివాసంలో జరిగింది. రాష్ట్రపతి రామనాధ్ కోవింద్, ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు ఈ రిసెప్షన్ కు హాజరయ్యారు.

రాజ్యసభలో సస్పెండైన పలువురు ఎంపీలు కూడా ఈ రిసెప్షన్ కు హాజరవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజ్యసభలో తమ ప్రవర్తన సరిగా లేదని 12 మంది ఎంపీలను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సస్పెన్డ్ చేశారు. సస్పెండైన ఎంపీలు రోజు నిరసన కార్యక్రామాలు నిర్వహిస్తోన్నా సస్పెన్షన్ ఎత్తెయ్యడానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య ఒప్పుకోవడం లేదు. క్షమాపణ చెప్తేనే సస్పెన్షన్ ఎత్తేస్తానని వెంకయ్య తెలపగా, సభలనైనా బహిష్కరిస్తాం గానీ క్షమాపణ చెప్పేది లేదని సస్పెండైన ఎంపీలు చెబుతున్నారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద సస్పెండైన ఎంపీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించగా వామపక్ష పార్టీల ఎంపీలు సంఘీభావం తెలుపుతున్నారు.

సస్పెండైన 12 మంది ఎంపీల్లో ఫూలోదేవి నేతం, ఛాయా వర్మ, రిపున్‌ బోరా, రాజామణి పటేల్‌ , అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌ అనే ఆరుగురు కాంగ్రెస్ నేతలుండగా, డోలా సేన్‌ , శాంతా ఛత్రీ అను ఇద్దరు తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీలు, ప్రియాంకా చతుర్వేది , అనిల్‌ దేశాయ్‌ ఇద్దరు శివసేన ఎంపీలు , బినోయ్‌ విశ్వం సీపీఐ, కరీం సీపీఏం ఎంపీలున్నారు.