కర్ణాటక రాజధాని బెంగళూరులో అనుమానిత ఉగ్రవాది (Suspected Terrorist)ని కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంయుక్త ఆపరేషన్‌లో అల్ ఖైదాతో సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నగరంలోని తానిసంద్ర మంజునాథ్ నగర్‌లో నివసిస్తున్న ఆరీఫ్‌ను పోలీసులు శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న నిందితుడు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పనిచేస్తున్నాడు.
గత రెండు సంవత్సరాలుగా ఆరిఫ్ అల్-ఖైదా ఉగ్రవాద సంస్థతో పరిచయం కలిగి ఉన్నాడని సమాచారం. ఆరిఫ్ ఐఎస్‌ఐఎస్‌తో టచ్‌లో ఉన్నాడని, ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నాడని ఐఎస్‌డీ అనుమానిస్తోంది. నిందితుడి కదలికలను పర్యవేక్షిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ.. స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ పోలీసులతో సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించి, వచ్చే మార్చి నెలలో ఇరాక్ మీదుగా సిరియా వెళ్లేందుకు సిద్ధమవుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: BJP Leader: బీజేపీ నేత దారుణ హత్య.. సాగర్ సాహును కాల్చి చంపిన నక్సలైట్లు
ఈ వ్యవహారంపై తదుపరి విచారణ ప్రారంభించారు. అరెస్టయిన నిందితుడి నుంచి ఉగ్రవాద ఉద్దేశాల గురించి మరింత సమాచారం రాబట్టవచ్చని ఎన్ఐఏ భావిస్తోంది. ఎన్‌ఐఏ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వ్యవహారంపై ఇప్పుడు విచారణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆరిఫ్ నుంచి ల్యాప్‌టాప్ సహా పలు అనుమానాస్పద వస్తువులను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది.