ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా, ఎగ్జిట్ పోల్స్ (Delhi Exit Poll Results 2025) ఫలితాలు బీజేపీ(BJP)కి అనుకూలంగా ఉన్నాయని వెల్లడించాయి. అయితే ఈ అంచనాలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సుశీల్ గుప్తా (AAP Sushil Gupta ) పూర్తిగా ఖండించారు. గత ఎన్నికల నుంచి ఎప్పుడూ ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా రాలేదని, కానీ చివరికి ప్రజా తీర్పు తమకే అనుకూలంగా మారిందని ఆయన స్పష్టం చేశారు.
Delhi Elections 2025 : ఢిల్లీ పీఠం ఏ పార్టీ ఎక్కువ సార్లు దక్కించుకుందో తెలుసా..?
సుశీల్ గుప్తా మాట్లాడుతూ.. ‘ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పుడు అంచనాలు వేస్తున్నాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. ప్రజలు మాపై విశ్వాసం ఉంచారు. అందుకే అసలైన ఫలితాలు మా అనుకూలంగానే ఉంటాయి’ అని ధీమా వ్యక్తం చేశారు. కొందరు విశ్లేషకుల ప్రకారం.. బీజేపీకి మోదీ ప్రభావం కలిసి వస్తోంది అంటున్నారు. మరికొంతమంది మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొంత వరకు తప్పొప్పుగా ఉండే అవకాశముందని చెబుతున్నారు. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? లేక ప్రజా తీర్పు మరోసారి ఆశ్చర్యానికి గురిచేస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.
ఇక ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ బుధువారం ప్రశాంతంగా ముగిసాయి. ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు పార్టీల నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.